e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home కరీంనగర్ కులవృత్తుల అభివృద్ధికి కృషి

కులవృత్తుల అభివృద్ధికి కృషి

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ/ఇల్లంతకుంట, సెప్టెంబర్‌ 20 : కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రైతుల సంక్షేమమే సర్కారు లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశా రు. సోమవారం ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామ శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నారన్నా రు. అంతరించిపోయిన కులవృత్తులకు ముఖ్య మంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పూర్వవైభవం వస్తున్నందుకు అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుల వృత్తుల అభివృద్ధికి ప్ర భుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. రైతుల పంటలకు నిరంతరం నీటి వసతి క ల్పించడం కోసం 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నదన్నారు. వ్యవసాయ అనుబంధ రం గాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. త్య్సకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 115 కోట్లతో 93 కోట్ల చేప పిల్లలను, 25 కోట్ల రొయ్యలను ఉచితంగా అందించిందని పేర్కొన్నా రు. ఈ చేప పిల్లలను రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు తోపాటు చెక్‌ డ్యాములలో పోశామన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భం గా అర్హులైన ముగ్గురికి చేపల వ్యాపారం చేసుకునేందుకు మూడు వాహనాలు అందించామని చె ప్పారు.

రాష్ట్రంలో గొల్ల కురుమలకు రెండో విడుత గొర్రెల పంపిణీకి దరఖాస్తు చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందిస్తే వెంటనే మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా మండలానికి వచ్చిన మంత్రికి గొల్ల కురుమలు గొంగడి కప్పి గొర్రెపిల్లను బహూకరించారు. అన్నపూర్ణ ప్రాజెక్టు ప్రాంతంలో ఫిష్‌ మార్కెట్‌ ఏర్పా టు కా వాలని మత్స్యకారులు అడుగగా, వెంటనే మంత్రి స్పందించి స్థలం చూపిస్తే వెంటనే మార్కె ట్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని, అలాగే అనంతగిరి ముత్యాల పోశమ్మ దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర సాంస్కృతిక సా రథి చైర్మన్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మా ట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభు త్వం మంజూరు చేస్తున్న వాహనాలను మత్స్యకారులు సద్వినియోగం చే సుకుని మొబైల్‌ వాహన వ్యాపారం చేసుకుని ఉ న్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను చూసి ఓర్వలేకే ఇతర పార్టీల నాయకులు ప్రభుత్వంపై బుదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నా రు. గ్రామాల్లో ఇతర పార్టీల ఉనికి కాపాడుకునేందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసత్య ప్రసారాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఫిషరీష్‌ కమిషనర్‌ లచ్చిరాం నాయక్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఏడీ శం కర్‌ రాథోడ్‌, డీఎఫ్‌వో శివప్రసాద్‌, ఎంపీపీ ఊ ట్కూరి వెంకటరమణారెడ్డి, డీవీఏహెచ్‌వో కొ మురయ్య, సర్పంచ్‌ పల్లె నర్సింహా రెడ్డి, ఎంపీటీసీ గొ ట్టెపర్తి పరశురాములు, ఏఎంసీ చైర్మన్‌ చింతల వేణురావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్య క్షుడు గొడుగు తిరుపతి, పోశమ్మ ఆలయ చైర్మన్‌ రాజారాం, ఉప సర్పంచ్‌ బాలకిషన్‌తోపాటు మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, అధికారులు, పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement