e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home కరీంనగర్ ఈటలపై దళితుల ఆగ్రహ జ్వాల

ఈటలపై దళితుల ఆగ్రహ జ్వాల

గన్నేరువరం, జూలై 29: దళితుల అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకమని టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడు అనుమండ్ల మల్లేశం పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టి బొమ్మను దహనం చేసి, ఈటల బావమర్ది మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుల సంక్షేమానికి దళిత బంధు పథకాన్ని అమలు చేస్తుంటే బీజేపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ దళిత నాయకులు న్యాత సుధాకర్‌, కుమ్మరి సంపత్‌, కర్ర కొమురయ్య, మీసాల ప్రభాకర్‌, న్యాత జీవన్‌, నక్క దామోదర్‌, వెదిరె పరశురామ్‌, పత్తి అంజి, న్యాత శంకర్‌, దేవేందర్‌, కవ్వంపల్లి రాయమల్లు, గూడెపు లింగయ్య, శిరిగిరి తిరుపతి, గంగరాజు పాల్గొన్నారు.

మంత్రి ఈటల బావమర్ది దిష్టి బొమ్మ దహనం
మానకొండూర్‌, జూలై 29: దళితజాతి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బావమరిది కొండవీటి మధుసూధన్‌రెడ్డిపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలో టీఅర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడు పారునంది కిషన్‌ ఆధ్వర్యంలో స్థానిక చెరువు కట్టవద్ద కరీంనగర్‌- వరంగల్‌ రహదారిపై మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ మల్లగల్ల నగేశ్‌, టీఆర్‌ఎస్‌వై మండల ఉపాధ్యక్షుడు పురం అనిల్‌, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కనుకుంట్ల నరేశ్‌, అంబేద్కర్‌ సంఘం మండలాధ్యక్షుడు కనుకుంట్ల అభిలాష్‌, నాయకులు కొండ్ర ప్రభాకర్‌, పుల్లూరి శ్రీనివాస్‌, వెంకటస్వామి పాల్గొన్నారు.

- Advertisement -

‘దళితులంటే.. అంత చులకనా’
తిమ్మాపూర్‌ రూరల్‌, జూలై 29: దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ బావమర్ది కొండవీటి మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మను అల్గునూర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ మండల శాఖ ఆధ్వర్యంలో దహనం చేశారు. అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉంటారని స్పష్టం చేశారు.

కొండవీటి వ్యాఖ్యలపై నిరసన
మానకొండూర్‌ రూరల్‌, (శంకరపట్నం) జూలై 29: ఈటల రాజేందర్‌ బావమరిది కొండవీటి మధుసూదన్‌రెడ్డి దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాట్సాప్‌లో చాటింగ్‌ చేయడాన్ని శంకరపట్నం వైస్‌ ఎంపీపీ రమేశ్‌ ఖండించారు. గురువారం మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో వైస్‌ ఎంపీపీ మాట్లాడారు. ఈటల సతీమణి జమున సోదరుడు దళితుల మనోభావాలు దెబ్బతీసేలా వాట్సాప్‌లో చాటింగ్‌ చేశారని తెలిపారు. మధుసూదన్‌ రెడ్డి దళితులకు క్షమాపణ చేప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకులు ఈటలకు మద్ధతుగా గ్రామాల్లోకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితులు ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టి నగదుగా రూ. 10లక్షలను అందజేస్తున్నట్లు తెలిపారు. దళితుల ఎదుగుదలను ఓర్వలేక కొందరు నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ భద్రయ్య, హుజూరాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ చౌడమల్ల వీరస్వామి, టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడు కనకం నాగయ్య, నాయకులు రవి, సుధాకర్‌, శ్రీనివాస్‌, సతీశ్‌రెడ్డి, లక్ష్మయ్య, కుమార్‌, కోటి, మహేందర్‌, తిరుపతి, సంపత్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana