e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home కరీంనగర్ ఆపదలో ఆర్థిక భరోసా సీఎంఆర్‌ఎఫ్‌

ఆపదలో ఆర్థిక భరోసా సీఎంఆర్‌ఎఫ్‌

చొప్పదండి, జూలై 31: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సాయం చేస్తూ అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ. 5,41,500 విలువైన ఆర్థిక సాయం మంజూరైంది. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌, నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పరామర్శ
మండలంలోని సర్వారెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కరబూజ తిరుపతిగౌడ్‌ తండ్రి రాజేశంగౌడ్‌ ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబసభ్యులను శనివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పరామర్శించారు. రాజేశంగౌడ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, ఆర్బీఎస్‌ మండల కో-ఆర్డినేటర్‌ పుల్కం గంగన్న, సర్పంచ్‌ వేముల దామోదర్‌, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు ఆకుల మధుసూదన్‌, వేముల అంజి, అట్ల శేఖర్‌రెడ్డి, చిలుముల రమేశ్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana