e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home కామారెడ్డి ఆడిటోరియానికి తుదిమెరుగులు

ఆడిటోరియానికి తుదిమెరుగులు

  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మాణం
  • చురుకుగా కొనసాగుతున్న పనులు
  • ఇప్పటికే 80 శాతం పూర్తి
  • మరో రెండు నెలల్లో అందుబాటులోకి భవనం
  • హర్షం వ్యక్తంచేస్తున్న జిల్లావాసులు
  • ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనున్న తిప్పలు

కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 5 : ప్రజలకు పాలనను చేరువ చేయడంతో పాటు సకల సౌకర్యాలు కల్పిం చే విధంగా సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే నూతన జిల్లాలు, డివిజన్లు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ భవనాలను నిర్మించారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా వాటిని ప్రారంభించడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన పాత ఎన్‌హెచ్‌-7ను ఆనుకొని ఎకరం స్థలంలో రూ.6 కోట్ల నిధులతో ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు 80 శాతం పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో ఆడిటోరియం అందుబాటులోకి రానున్నది. స్థానిక మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో ఆడిటోరియం అందుబాటులోకి రానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారిక, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రైవేటు ఫంక్షన్‌ హాళ్లపై ఆధారపడాల్సి వస్తున్నది. ఆడిటోరియం అందుబాటులోకి వస్తే ప్రభుత్వ కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది. ప్రస్తుతం జిల్లా కేం ద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర, గణతంత్ర, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహిస్తున్నారు. స్టేడియం సమీపంలోనే ఆడిటోరియం అందుబాటులోకి రానున్నది. నిజాంసాగర్‌ చౌరస్తాలో రూ. 3 కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే ప్రభుత్వ యంత్రాంగానికి కావలసిన భవనాలను అన్ని సౌకర్యాలతో నిర్మిస్తూ ప్రజలకు అన్ని రకాల సేవలు సులభంగా అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

- Advertisement -

రెండు నెలల్లో పనులు పూర్తి
జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు రెండు నెలల్లో పూర్తవుతాయి. రూ.6 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. 650 మంది కూర్చునే సామర్థ్యం ఆడిటోరియంలో ఉంటుంది.
-వాసుదేవ రెడ్డి, మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana