e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home కామారెడ్డి కులవృత్తులకు కొత్త ఎనర్జీ

కులవృత్తులకు కొత్త ఎనర్జీ

  • సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్‌ పథకానికి దండిగా దరఖాస్తులు
  • రజక, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ పథకానికి విశేష స్పందన
  • ఉమ్మడి జిల్లాలో సుమారు 4వేల సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లు
  • ఇప్పటి వరకు 2,323 దరఖాస్తులు రాక
  • కులవృత్తులకు కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

నిజామాబాద్‌, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. రజక, నాయీబ్రాహ్మణులకు కరెంట్‌ బిల్లు బాధలను తప్పించేందుకు సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా ఆయా కుటుంబాల పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్‌ స్వయంగా వారి మేలు కోసం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ధోబీఘాట్లు, లాండ్రీ షాపులు, సెలూన్లలో వినియోగమయ్యే విద్యుత్‌ ఖర్చు బాధను పూర్తిగా లేకుండా చేసేందుకు సీఎం నిర్ణయించా రు.

ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా రజక, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్లులోపు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నా యి. ఇప్పటికే ఆయా వర్గాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించండంతో వందలాది మంది అర్హులు… ధ్రువపత్రాలతో ఉచిత విద్యుత్‌ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నా రు. సెలూన్‌, లాండ్రీ, ధోబీఘాట్లకు ఎన్పీడీసీఎల్‌ అధికారులు వాణిజ్య కేటగిరిలో నిర్ధారించడంతో కరెంట్‌ బిల్లు వారికి తడిసి మోపెడవుతున్నది. తెలంగాణ సర్కారు తీ సుకువచ్చిన పథకంతో విద్యుత్‌ భారం పూర్తిగా తొలిగిపోనుంది. రజక, నాయీబ్రాహ్మణులు నిర్వహించే సెలూన్‌, ధోబీఘాట్‌, లాండ్రీ షాపుల్లో ఎక్కువ మందికి నెలవారీగా 250 యూనిట్లతోనే విద్యుత్‌ అవసరం తీరనున్నది.

- Advertisement -

దండిగా దరఖాస్తులు…
250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ పథకానికి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మంచి స్పందన లభిస్తోంది. ఆయా వర్గాల నుంచి అర్హులైన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. రజక, నాయీ బ్రాహ్మణులు తమ కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటే తహసీల్దార్‌ ధ్రువపరిచిన కుల ధ్రువీకరణ పత్రం, షాపు కిరాయి తీసుకున్న ఒప్పంద పత్రం, దరఖాస్తుదారుడి ఆధార్‌ కార్డు, 4 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, మీటర్‌ రీడింగ్‌ బిల్లు జిరాక్స్‌తో నేరుగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఆయా జిల్లాలోని బీసీ కార్పొరేషన్‌ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో నాయీ బ్రాహ్మణుల నుంచి 998 దరఖాస్తులు వచ్చాయి. రజకుల నుంచి 439 దరఖాస్తులను స్వీకరించారు. కామారెడ్డి జిల్లాలో నాయీబ్రాహ్మణుల నుంచి 582, రజకుల నుంచి 304 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో 250 యూనిట్లులోపు ఉచిత విద్యుత్‌ పథకానికి మొత్తం 2,323 దరఖాస్తులు వచ్చాయి. అర్హులుగా ఉండి దరఖాస్తు చేసుకోలేని స్థితిలో ఉన్న వారికి సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో గ్రామాల్లో చాటింపు వేయించి దరఖాస్తులు కోరుతున్నారు.

విద్యుత్‌ బిల్లుల భారం ఉండదిక…
క్షౌరశాలలు, లాండ్రీ షాపులు, ధోబీఘాట్‌లకు ఈ ఏడా ది ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం 250 యూనిట్లు వరకు విద్యు త్‌ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన వరాలను జిల్లాలోని రజకులు, నాయీ బ్రాహ్మణులు పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు అర్హులైన వారిలో సగానికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు తహసీల్‌ కార్యాలయాల నుంచి కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. క్షౌరశాలలు, లాండ్రీ షాపులు నిర్వహించే వారికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ప్రభు త్వం ఆహ్వానించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆయా కులా ల్లో విద్యావంతులు లేకపోవడంతో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక తికమకపడ్డారు. బీసీ కార్పొరేషన్‌ కార్యాలయం లో నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో వారందరికీ భారీ ఊరట లభించింది. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో షాపు యజమాని ఒకరుంటే… క్షౌరశాలలను నడిపేవారు, పని చేసేవారు మరికొందరు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత విద్యుత్తు పొందాలంటే యజమానితో లిఖిత పూర్వకంగా రాసుకున్న బాండ్‌ పేపర్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తులు స్వీకరిస్తున్నాం
ప్రభుత్వ మార్గదర్శకాల మే రకు 250 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్‌ పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తు న్నాం. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎలక్ట్రిసిటీ బిల్లు అప్‌లోడ్‌ చేయాలి. అందులో పూర్తి వివరాలు పొందుపర్చాలి. తప్పులు ఏమైనా ఉన్నా, వివరాలు సరిగా పొందుపర్చకపోయినా వారికి ఎడిట్‌ ఆప్షన్‌ను ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తుదారులు వివరాలు ఎడిట్‌ చేసుకుని లబ్ధిపొందాలి. లాండ్రీ, ధోబీఘాట్‌, సెలూన్‌ నిర్వాహకుడు నడిపే షాపునకు కమర్షియల్‌ ఎలక్ట్రిసిటీ మీటర్‌ ఉండాలి. ఇంటి మీటర్‌ ఉంటే… దరఖాస్తు చేసుకునేటప్పుడు న్యూ అని ఆప్షన్‌ పెట్టుకోవాలి. ప్రభుత్వమే కొత్త మీటర్‌ ఇస్తుంది.

  • రమేశ్‌, బీసీ సంక్షేమాధికారి, నిజామాబాద్‌ జిల్లా
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana