e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home కామారెడ్డి అందుబాటులో ఉంటాం..

అందుబాటులో ఉంటాం..

  • దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నాం
  • ఎస్సారెస్పీని పరిశీలించిన మంత్రి వేముల
  • వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష
  • ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశం

మెండోరా, సెప్టెంబర్‌ 28: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అధికారులు, ప్రజా ప్రతినిధు లందరూ అందుబాటులో ఉంటారని రాష్ట్ర రోడ్లు, భవనాలు,హౌసింగ్‌, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో మంగళవారం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. ఇన్‌ఫ్లో, మిగుల జలాల విడుదలపై అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ చక్రపాణి, ఆర్డీవో శ్రీనివాస్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి ఉధృతిని పరిశీలించారు. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్‌ ప్రాజెక్టుల అధికారులతో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. ప్రాజెక్ట్‌ల నుంచి నీటి విడుదల, వర్షపాతం వివరా లు అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ ఎగువన ఉన్న బోధన్‌ నియోజకవర్గంలోని కందకుర్తి, హంగర్గ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదుకావడంతో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైనట్లు చెప్పారు. దీం తో పంట నష్టం జరిగిందన్నారు. నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. రైతులు పంటలను నష్టపోవడం బాధిస్తోందన్నారు. పలుచోట్ల వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయని, మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రజల క్షేమం కోరి సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారని తెలిపారు. ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. మత్స్య కారులు చేపలవేటకు వెళ్లవద్దన్నారు. గ్రామాల్లో చెరువులు తెగిపోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి

- Advertisement -

వర్షాలపై అధికారులతో సమీక్షలో మంత్రి వేముల
వేల్పూర్‌, సెప్టెంబర్‌ 28: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూ డాలని అధికారులను మంత్రి వేముల ప్ర శాంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆ యన వేల్పూర్‌లోని మంత్రి నివాసంలో ఆయా శాఖ ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వ ర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గంలో తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం తగదని అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, పంట నష్టం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా విద్యుత్‌ ఇబ్బందులు ఏర్పడితే వెం టనే పునరుద్ధరించాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయా గ్రామా ల్లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు మిషన్‌ భగీరథ నీటి సరఫరా పనులు పూర్తిచేయాలన్నారు. ఆర్డీవో శ్రీనివాసులు, డీసీవో సింహాచలం, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజేంద్రకుమార్‌, డీఎల్‌పీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement