e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home కామారెడ్డి గులాబీ గర్జన !

గులాబీ గర్జన !

  • ఓరుగల్ల్లు సభకు టీఆర్‌ఎస్‌శ్రేణుల సన్నద్ధం
  • తెలంగాణ విజయగర్జనగా అభివర్ణించిన టీఆర్‌ఎస్‌
  • అధిష్టానం ఆదేశాలతో త్వరలో సన్నాహక సమావేశాలు
  • నవంబర్‌ 15న తలపెట్టిన ప్లీనరీకి శ్రేణుల సంసిద్ధం
  • లక్షలాది మంది కార్యకర్తలతో ఘనంగా ద్విదశాబ్ది ఉత్సవాలు
  • ఇప్పటికే గ్రామ, మండల, వార్డు కమిటీల నియామకం పూర్తి

తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు టీఆర్‌ఎస్‌ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే అధిష్టానం ఆదేశాల మేరకు గ్రామ, వార్డు, మండల, అనుబంధ కమిటీల నియామకం సైతం పూర్తయ్యింది. గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ప్లీనరీని నిర్వహించలేకపోయిన టీఆర్‌ఎస్‌.. వచ్చే నెల 15న ‘తెలంగాణ విజయగర్జన’ పేరిట ఓరుగల్లులో ప్లీనరీ నిర్వహించేం దుకు సిద్ధమవుతున్నది. వరంగల్‌ వేదికగా జరిగే ద్విదశాబ్ది వేడుకలను విజయవంతం చేసేందుకు త్వరలోనే జిల్లాలో సన్నాహక సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీగా రికార్డుకెక్కిన తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు సిద్ధం అవుతున్నది. రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన గులాబీ పార్టీ… అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది. కొ ట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నే ప్రజలంతా నిలబెట్టారు. 2014, 2018లో రెండుమా ర్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కే పట్టం కట్టారు. ఉద్యమ నాయకుడే… సీఎంగా ఉండడంతో స్వరాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతున్నది. ప్రజల అభీష్టం మేరకు పథకాలు అమలవుతున్నాయి. అధిష్టానం ఆదేశాలతో గ్రామ, వార్డు, మండల, అనుబంధ కమిటీల నియామకం విజయవంతంగా పూర్తి చేసుకున్నది. నవంబర్‌ 15న తెలంగాణ విజయ గర్జన పేరుతో భారీ బహిరంగ సభతో గులాబీ పార్టీ మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతుండడంతో శ్రేణుల్లో ఉత్తేజం కనిపిస్తోంది.

- Advertisement -

విజయవంతంగా సంస్థాగత నిర్మాణం…

స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి ఏకంగా ఇరవై ఏండ్లు పూర్తి చేసుకున్నది. రెండు దశాబ్దాల కాలంలో అనేక అద్భుత ఘట్టాలకు సాక్షాత్కారమైన టీఆర్‌ఎస్‌ కరోనా మహమ్మారితో గత ఏడాది ప్లీనరీ నిర్వహించలేకపోయింది. కమిటీల కూర్పు సైతం వాయి దా పడగా తాజాగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. వాడవాడల్లో గులాబీ జెండా ఎగురవేసే విధంగా కమిటీలను ఏర్పా టు చేసింది. క్రియాశీలక సభ్యులకు వివిధ పార్టీ పదవులతో సముచిత స్థానాన్ని కట్టబెట్టారు. పార్టీకి ఏండ్లుగా సేవలందిస్తున్న వారికి వివిధ స్థాయిల్లో పదవులను అందించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సారథ్యంలోనే పార్టీ కమిటీల కూర్పు జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం పకడ్భందీగా చేపట్టడం మూలం గా టీఆర్‌ఎస్‌ బలం క్షేత్రస్థాయికి చేరింది. కాంగ్రె స్‌, బీజేపీ వంటి జాతీ య పార్టీలు బలహీనమైన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ వాడవాడలో టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడుతుండడం విశేషం.

విజయ గర్జన…

తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ అధినేత కేసీఆర్‌ నేతృత్వంలో సభలు, సమావేశాలు కోకొల్లలుగా జ రిగాయి. ధూంధాం కార్యక్రమాలతో ప్రజల్లో రాష్ట్ర ఏ ర్పాటు ఆవశ్యకతను తెలియజేశారు. చారిత్రాత్మకమైన సభలతో ప్రపంచ రికార్డులను సైతం తిరగరాసిన చరిత్ర టీఆర్‌ఎస్‌ పార్టీ సొంతం. అధికారంలోకి వచ్చిన తర్వా త కూడా పార్టీ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. ఎన్నికల సమయాల్లోనూ సభలతో ప్రజలకు దగ్గరైంది. రెండేండ్లకోసారి పార్టీ ప్రతినిధులతో ప్లీన రీ నిర్వహించి ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రయోజనాలు వంటి అంశాలపై లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా విస్తృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో నవంబర్‌ 15న పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.చారిత్రక ఓరుగల్లు వేదికగా లక్షలాది మంది పార్టీ కార్యకర్తలతో ఈ మీటింగ్‌ను నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించడంతో శ్రేణు ల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో దాదాపు 5లక్షల సభ్యత్వాలతో టీఆర్‌ఎస్‌ ప్రథమ స్థానంలో ఉంది. ఏ ఇ తర పార్టీలు కనీసం టీఆర్‌ఎస్‌ పార్టీ దరిదాపుల్లో లేవంటే అతిశయోక్తి కాదు.

సన్నాహక సభలు…

తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలు వచ్చే నెల లో తలపెట్టారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పకడ్బందీ కార్యాచరణను టీఆర్‌ఎస్‌ సిద్ధం చేసింది. నవంబర్‌ 15న తెలంగాణ విజయ గర్జన పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సభలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 27న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ద్విదశాబ్ది ఉత్సవాల బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై మీటింగ్‌ జరుగనున్నది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటుగా ఎమ్మెల్యేల సమన్వయంతో ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చిన దరిమిలా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా స భల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగిన ట్లు సమాచారం. గ్రామ, మండల కమిటీలతో పాటుగా అనుబంధ సంఘాల్లోని ప్రతినిధులను సన్నాహక సమావేశాలకు ఆహ్వానించనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement