ఆర్మూర్, జూన్ 12: టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆర్మూర్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. హైదరాబాద్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సోదరుడు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు టీఆర్ఎస్ నాయకులతో కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ నాయకులతో కలిసి రాజేశ్వర్‌రెడ్డితో కేక్ కట్ చేయించి ఆయనకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులందరూ రాజేశ్వర్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్‌లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పండిత్ వినితా పవన్, నాయకుడు పండిత్ ప్రేమ్, ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
పిప్రి సొసైటీ చైర్మన్ సోమ హేమంత్‌రెడ్డి, పిప్రి ఎంపీటీసీ సామెర సురేశ్, కౌన్సిలర్లు తాటి హన్మాండ్లు, బారడ్ రమేశ్, పెర్కిట్ సొసైటీ వైస్‌చైర్మన్ ఇట్టెడి గంగారెడ్డి, సొసైటీ డైరెక్టర్ మామిడి ఏలియారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మహిపాల్‌రెడ్డి, రాజేశ్వర్, నర్సయ్య పాల్గొన్నారు.