e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home కామారెడ్డి కొనసాగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు

కొనసాగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు

కొనసాగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు

నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 29 : డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం 35 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ బాబురావు తెలిపారు. మొత్తం 84 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు పేర్కొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 23 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ రఘువీర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌తో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవీందర్‌ తెలిపారు. 63 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు పేర్కొన్నారు.

మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మోపాల్‌ మండల కేంద్రంలో170 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 30 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ నవీన్‌ తెలిపారు. కోటగిరి మండలంలోని పొతంగల్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53 మందికి కరోనా టెస్టులు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కోటగిరి దవాఖానలో 10 మందికి టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో 17 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. సూపర్‌ స్ప్రెడర్స్‌కు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా 19 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు పేర్కొన్నారు. రుద్రూర్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 67 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు డా క్టర్‌ దిలీప్‌ తెలిపారు. మోస్రా మండల కేంద్రంలో 33 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి మధుసూదన్‌ తెలిపారు.
బాల్కొండ, ఆర్మూర్‌, బోధన్‌ నియోజకవర్గాల్లో
భీమ్‌గల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 102 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్‌పవార్‌ తెలిపారు. మోర్తాడ్‌ సీహెచ్‌సీలో 11 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. కమ్మర్‌పల్లి పీహెచ్‌సీలో 74 మందికి టెస్టులు నిర్వహించగా తొమ్మి ది మందికి పాజిటివ్‌ వచ్చింది. చౌట్‌పల్లి పీహెచ్‌సీలో 40 మందికి టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. కమ్మర్‌పల్లి పీహెచ్‌సీలో 20 మంది సూపర్‌ స్ప్రెడర్లకు తొలిడోసు టీకా వేశారు. బోధన్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానలో 35 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి, రాకాసీపేట్‌ అర్బన్‌హెల్త్‌ సెంటర్‌లో 12 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. పాన్‌గల్లీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది. బోధన్‌లో మొత్తం 58 మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు.

బోధన్‌ మండలం సాలూరా చెక్‌పోస్ట్‌ వద్ద నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు సాలూరా మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేఖ తెలిపారు. మాక్లూర్‌, కల్లడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పరీక్షల్లో 13 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు సంజీవ్‌రెడ్డి, సిఖిందర్‌నాయక్‌ తెలిపారు. ఆర్మూర్‌ ఏరియా దవాఖాన, పట్టణంలోని హౌసింగ్‌ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు నాగరాజు, భాస్కర్‌రావు, ఆయేషా ఫిర్దోస్‌, స్వాతి వినూత్న, అమృత్‌రాంరెడ్డి తెలిపారు. రెంజల్‌ పీహెచ్‌సీ, కందకుర్తి చెక్‌ పోస్టు వద్ద పలువురికి శనివారం కొవిడ్‌ -19 పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌ వచ్చిందని మండల వైద్య సిబ్బంది తెలిపారు.
కరోనాతో కాంగ్రెస్‌ నాయకుడి మృతి
ఆర్మూర్‌, మే 29 : కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు పీసీ భోజన్న కరోనాతో శనివారం మృతి చెందారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడగా దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గతంలో ఆర్మూర్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, ఆర్మూర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పని చేశారు. మృతుడికి భార్య, పిల్లలుఉన్నారు.
ఇందల్వాయి మండలం డోన్‌కల్‌లో మరొకరు..
ఇందల్‌వాయి, మే29 : మండలంలోని డోన్‌కల్‌ గ్రామానికి చెందిన జంగం మహేశ్‌ (50) కరోనాతో మృతిచెందాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌ రాగా.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొనసాగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు

ట్రెండింగ్‌

Advertisement