e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home కామారెడ్డి శ్వాస ఇబ్బందులకు చెక్‌

శ్వాస ఇబ్బందులకు చెక్‌

శ్వాస ఇబ్బందులకు చెక్‌
  • ఫిజియోథెరపీతోనూ కరోనాను ఎదుర్కోవచ్చు
  • ప్రముఖ ఫిజియోథెరపిస్టు మౌనిక మోరె

కామారెడ్డి రూరల్‌, మే24 : ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి చేరని ప్రాంతమంటూ లేదు. అయితే కరోనా సోకిన వారిలో చాలా వరకు భయంతోనే మృత్యువాత పడుతున్నారని, ఇంట్లో ఉంటూ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే దవాఖానకు వెళ్లకుండానే వ్యాధినిరోధక శక్తి పెంచుకొని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని చెబుతున్నారు కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్టు మౌనిక మోరె. ఆక్సిజన్‌ స్థాయి పెంచుకోవడంలో ఫిజియోథెరపీ ప్రముఖ పాత్ర వహిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ప్రోనింగ్‌, చెస్ట్‌ ఫిజియోథెరపీ ద్వారా శాస్వ ఇబ్బందులను అధిగమించవచ్చని చెబుతున్నారు. ప్రోనింగ్‌ పద్ధతి ద్వారా ఊపిరితిత్తుల్లో ఉండే అల్వియొలార్‌ యూనిట్స్‌ తెరుచుకుంటాయి. ఫలితంగా ఊపిరి అందుతుంది.

ప్రోనింగ్‌ చేసే విధానం

ప్రోనింగ్‌ ప్రక్రియకు ఐదు దిండ్లు అవసరమవుతాయి. ఒక దిండును మెడ కింద, ఒకటి లేదా రెండు దిండ్లను ఛాతి కింద (తొడల పైభాగం వరకూ కవరయ్యేలా), మరో రెండు దిండ్లను మడమ ముందుభాగం(మోకాళ్ల కింద భాగం)లో పెట్టుకోవాలి. ఈ పొజిషన్‌లో అరగంటపాటు ఉండాలి.
భోజనం తర్వాత రెండు గంటల వరకూ ప్రోనింగ్‌ ప్రక్రియ పాటించకూడదు.
తేలిగ్గా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ఇలా చేయాలి. ఇందుకోసం శరీరాన్ని బలవంత పెట్టొద్దు.
వైద్యుల సూచనలు పాటిస్తూ వివిధ భంగిమల్లో ప్రోనింగ్‌ చేయవచ్చు. అది కూడా సౌకర్యవంతంగా ఉంటేనే.
గర్భిణులు, వెన్నెముక సమస్యలున్నవారు, గుండెజబ్బులతో బాధపడేవారు ప్రోనింగ్‌కు దూరంగా ఉండాలి.

చెస్ట్‌ ఫిజియోథెరపీ..
ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను తొలగించేందుకు చెస్ట్‌ ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. దీంట్లో రోగికి అవసరమగు పద్ధతుల్లో ఫిజియోథెరఫీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా వైద్యుల సంరక్షణలో లేదా అనుభవం ఉన్న వారి సంరక్షణలో చేయాల్సి ఉంటుంది. దీంతో ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటకు తొలగించేందుకు ఛాతిపై, వీపు భాగంలో చేతితో కొట్టడం ద్వారా నాలాల్లో పేరుకుపోయిన కఫం బయటికి వచ్చి గాలిని పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఎక్కువగా కొవిడ్‌ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్వాస సక్రమంగా తీసుకుంటూ, వదలడంతో ఊపిరితిత్తుల పని పెరిగి సులభంగా శ్వాస తీసుకుంటారు.

మనోధైర్యంతోనే జయించవచ్చు..
కొవిడ్‌బారినపడి చనిపోయిన వారిలో అధికశాతం శ్వాసకోశ ఇబ్బందులకు గురైనవారే. అందులోనూ ఆత్మైస్థెర్యం కోల్పోయినవారే ఉన్నారు. కొవిడ్‌ పేషంట్లతోపాటు సాధారణ ప్రజలంతా ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అంతేగాకుండా స్వచ్ఛమైన గాలి అందేలా చూడాలి. ఉదయం, సాయంత్రం చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే లక్షల రూపాయల ఖర్చులతోపాటు ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు.
-డాక్టర్‌ మౌనిక మోరె, ఫిజియోథెరపిస్టు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శ్వాస ఇబ్బందులకు చెక్‌

ట్రెండింగ్‌

Advertisement