e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home కామారెడ్డి నడకతో.. సంపూర్ణ ఆరోగ్యం

నడకతో.. సంపూర్ణ ఆరోగ్యం

నడకతో.. సంపూర్ణ ఆరోగ్యం
 • వాకింగ్‌తో శరీరం ఫిట్‌
 • నడకతో రోగాలు దూరం
 • ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి

బాన్సువాడ రూరల్‌/ రామారెడ్డి, జూన్‌ 23:మీరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా? మీ శరీరం ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే రోజూ వాకింగ్‌ చేయడం అద్భుతమైన మార్గం. ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్‌ ఎంతో ఉపయోగకరమైనది. ఉదయం నిద్రలేచిన తర్వాత నడక ప్రారంభించడం ఎంతో ఉత్తమం. ఉదయం పూట స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. సూర్యోదయపు నులివెచ్చటి కిరణాలు శరీరానికి తగులుతుంటే ఆహ్లాదకరంగా ఉండడంతోపాటు ఆరోగ్యానికీ ఉపకరిస్తుంది.

మారుతున్న కాలం.. హడావుడి జీవితం.. తీవ్రమవుతున్న మానసిక ఒత్తిడి.. వెరసి రకరకాల వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రోగాలతో సతమతమవుతున్నారు. అన్నంతోపాటు పిడికెడు మాత్రలు అందుబాటులో ఉంచుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. శరీరానికి శ్రమ తగ్గిపోవడంతో వ్యాధులకు గురవుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒత్తిడి జయించడానికి, సంపూర్ణ ఆరోగ్యానికి నడక ప్రధాన పాత్ర వహిస్తుందని అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు.
పూర్వీకులు చాలా కష్టపడేవారు. వారికి నడక, వ్యవసాయ ఆధారిత వ్యాయామాలు తప్ప వేరే వ్యాయామం తెలియదు. నడక అనేది మనిషి శరీరానికి అత్యంత సరైన వ్యాయామం. బాడీ బిల్డింగ్‌ వ్యాయామం శరీరంపై ఒత్తిడిని కలిగిస్తుంది. కృత్రిమ ఆరోగ్యం కాకుండా రోజుకు కేవలం 30 నిమిషాలు నడవడం ద్వారా సాధారణ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను సాధించవచ్చు. నడక శరీర నిర్మాణాన్ని మారుస్తుంది.

- Advertisement -

నడకపై పెరుగుతున్న ఆసక్తి ..
నడక ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రజలు తమ అలవాట్లను మార్చుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో వాకింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన రోడ్లు, ప్రైవేటు వెంచర్లలో పిల్లల నుంచి యువకులు, వృద్ధులు సైతం వాకింగ్‌ చేస్తున్నారు.

నడకతో లాభాలు..

 • దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తుంది.
 • ఒత్తిడిని తగ్గించి నిద్రకు ఉపయోగపడుతుంది.
 • తెల్లరక్త కణాలను ఉత్పత్తి చేసి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
 • కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 • మలబద్ధకాన్ని నివారిస్తుంది.
 • కీళ్లనొప్పులు, వెన్ను నొప్పి తగ్గుతుంది.
 • అల్జీమర్స్‌ను అడ్డుకుంటుంది.
 • అధిక బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
 • మధుమేహం, గుండెజబ్బు అదుపులోకి వస్తాయి.
 • క్యాన్సర్‌ వంటివి రాకుండా తోడ్పడుతుంది.
 • నడక జీర్ణవ్యవస్థను అవసరమైనంతగా ప్రేరేపిస్తుంది.

ప్రారంభించండి ఇలా..

 • వాకింగ్‌ ప్రారంభించే వారు మొదటి రోజు 5 నుంచి 15 నిమిషాలు నడిచి క్రమేపీ పెంచాలి.
 • బూట్లను తప్పనిసరిగా ధరించాలి.
 • వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేస్తే ఆరోగ్యానికి మంచిది.
 • రోడ్డు మీద కాకుండా మైదానాల్లోనే వాకింగ్‌ చేయడం మంచిది.

మానసిక ప్రశాంతత లభిస్తుంది
నెల రోజుల నుంచి వాకింగ్‌ చేస్తున్నా. రోజూ ఉదయం నడవడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. సుమారు నాలుగు కిలోమీటర్లు నడుస్తాను. నడకతో ఎలాంటి అలసట అనిపించడం లేదు. నడక ప్రాముఖ్యతను తెలుసుకుని రోజూ మిత్రులతో కలిసి వాకింగ్‌ చేస్తున్నాను.

 • పీర్యానాయక్‌, బోర్లం క్యాంపు
  రోగాలు రావని తెలిసి..
  ఉదయం, సాయంత్రం నడవడంతో రోగాలు రావని తెలుసుకున్నాను. వైద్యులు సైతం రోజూ వాకింగ్‌ చేయాలని చెబుతున్నారు. బీపీ, షుగర్‌ అదుపులో ఉంటాయి. నడకతో ఏకాగ్రత పెరిగి ఆరోగ్యంగా ఉంటున్నాము.
 • రవి, పోచారం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నడకతో.. సంపూర్ణ ఆరోగ్యం
నడకతో.. సంపూర్ణ ఆరోగ్యం
నడకతో.. సంపూర్ణ ఆరోగ్యం

ట్రెండింగ్‌

Advertisement