e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home కామారెడ్డి హరిత శోభ!

హరిత శోభ!

 • పచ్చదనం సంతరించుకున్న పిట్లం మార్కెట్‌ కమిటీ కార్యాలయం
 • సంరక్షిస్తున్న అధికారులు, సిబ్బంది
 • ఆహ్లాదం పంచుతున్న ‘హరితహారం’ మొక్కలు
 • చెట్ల కింద సేదదీరుతున్న అన్నదాతలు

పిట్లం, అక్టోబర్‌ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పల్లెలు, పట్టణాలతోపాటు సర్కారు కార్యాలయాలూ పచ్చదనం సంతరించుకుంటున్నా యి. ఇందులోభాగంగా పిట్లం మండలకేంద్రంలోని మార్కెట్‌ కమిటీ కార్యాలయం పార్కును తలపిసున్నది. ధాన్యాన్ని విక్రయించుకునేందుకు లేదా వివిధ పనుల కోసం మార్కెట్‌ కమిటీ కార్యాలయానికి వస్తున్న రైతులకు ఇక్కడ ఏపుగా పెరిగిన మొక్కలు, చెట్లు ఆహ్లాదం పంచుతున్నాయి. పచ్చని చెట్లకింద ఏర్పాటు చేసిన బెంచీలపై కూర్చుని సేదతీరుతున్నారు. హరితహారం కార్యక్రమంలో నాటి న మొక్కలను సంరక్షించేందుకు మార్కె ట్‌ కమిటీ అధికారులు ప్రతిరోజూ నీటిని పడుతున్నారు. మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేశా రు. ఒకవైపు వివిధ రకాల పూల మొక్కలతో కనువిందు చేస్తుండగా మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం లభించడంతో వచ్చిన వారు ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు.

సీఎం ఆలోచన అద్భుతం

- Advertisement -

హరితహారం నిధి ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచన అద్భుతం.మేమంతా ఆయన ఆశయాలను నెరవేర్చుతాం. రైతులకు హరితనిధి ఆవశ్యకతను వివరిస్తాం. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం, ఆక్సిజన్‌ అందించేందుకు హరితహారం కార్యక్రమం మ రింతగా విస్తరించాలనే ప్రభుత్వ ఆలోచన గొప్పది. ఈ కార్యక్రమం కోసం అం దరం స్వచ్చందంగా ముందుకు వచ్చి హరితనిధికి మా వంతు సహకారం అందిస్తాం. ఓ సామాజిక బాధ్యతగా మేం కూడా మావంతు నిధిని సమకూర్చుతాం.
-లక్ష్మీబాయి,
మార్కెట్‌ కమిటీ, చైర్‌పర్సన్‌, పిట్లం

గుట్టకు పచ్చల హారం

 • రైతన్నకు కాసులవరం!
 • గుట్టపైన మామిడి, ఈత, టేకు చెట్ల పెంపకం

కోటగిరి, అక్టోబర్‌ 19 : మండల కేంద్రం సమీపంలో ఉన్న రోజాపూర్‌గుట్ట హరితహారం కారణంగా పచ్చందాలను సంతరించుకున్నది. హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం.. రోజూపూర్‌గుట్టపై నిరుపయోగంగా ఉన్న ఎకరం అసైన్డ్‌ భూమిలో పండ్లతోటను పెంచాలని నిర్ణయించింది. గ్రామానికి చెందిన రైతు శంకర్‌గౌడ్‌కు ప్రభుత్వం గతంలో ఎకరం అసైన్డ్‌ భూమిని కేటాయించగా అది నిరుపయోగంగా ఉంది. ఆ భూమిని అభివృద్ధి చేసి హరితహారంలో భాగంగా పండ్ల తోటలను నాటితే పచ్చదనం పెరుగడంతోపాటు సదరు రైతుకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని గ్రామ పంచాయతీ పాలకవర్గం భావించింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో నిరుపయోగంగా ఉన్న భూమిలో బోరు, మోటరు, విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఉపాధిహామీ పథకం ద్వారా మామిడి, ఈత, టేకు, సపోట మొక్కలను నాటించారు. మొక్కల సంరక్షణపై గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఈజీఎస్‌ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించడంతో మొక్కలు వృక్షాలుగా మారి ప్రస్తుతం పండ్లు చేతికి వస్తున్నాయి. గుట్ట పచ్చదనంతో కళకళలాడుతున్నది. తోటను ప్రస్తుతం రైతు శంకర్‌గౌడ్‌కు అప్పగించారు. రోజాపూర్‌గుట్టను పలువురు అధికారులు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.

వందశాతం మొక్కలను సంరక్షించాం..

కోటగిరి సమీపంలోని రోజాపూర్‌ శివారులోని గుట్టపైన ఎకరం భూమిలో మామిడి, ఈత, టేకు మొక్కలను నాటినం. ప్రత్యేకంగా కాపలదారుడిని నియమించి కంటికి రెప్పలా కాపాడినం. వేసవిలో ప్రతిరోజూ నీరు పెట్టినం.. 100 శాతం మొక్కలు బతికినయి. ప్రస్తుతం ఏపుగా పెరిగి కాత దశకు చేరుకున్నాయి.

 • శంకర్‌గౌడ్‌, రైతు కోటగిరి

పచ్చని తెలంగాణకు నాంది.. హరితహారం

 • బంగారు తెలంగాణకు వారధి హారతి హారం
 • ఎండిన గొంతుకైన పుడమి తల్లి పరవశించేలా..
 • బీడువారిన భూములు పాడి పంటలై పొంగి పొర్లేలా..
 • నింగికెగిసిన మబ్బు చినుకై నేల రాలేలా
 • కరువుకాటకాలను తరిమి కొట్టేలా
 • వలస బతుకులకు చరమగీతం పాడేలా
 • చెట్టు చేమ పులకరించేలా
 • గట్టు మీద, గుట్ట మీద, కల్ల మీద, పుట్ట మీద
 • తొవ్వ పక్కన, ఇంటి పక్కన
 • పాఠశాల, పంచాయతీలో
 • ఊరువాడ, గ్రామ గ్రామానా
 • పట్టణాన, నగరాన,
 • రాష్ట్రమంతా, దేశమంతా,
 • జనమంతా కదం తొక్కుతూ..
 • జగమంతా హరితవనం అయ్యేలా..
 • తల్లి తెలంగాణ మెడలో హరితహారం అయ్యేలా
 • హరితహారం.. హరితహారం…
 • పచ్చని తెలంగాణకు నాంది హారితహారం.
 • హరితహారం… హరితహారం…
 • బంగారు తెలంగాణకు వారధి హారతి హారం…
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement