e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home కామారెడ్డి అన్నదాతకు ‘సహకారం’

అన్నదాతకు ‘సహకారం’

అన్నదాతకు ‘సహకారం’

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 14 : రైతులకు నిరంతరం సేవలందిస్తూ ముందుకుసాగుతున్నది ఇందల్వాయి సహకార సంఘం. సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతూ అన్నదాతలకు ఎప్పటికప్పుడూ సలహాలు, సూచనలు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. విత్తనం విత్తిన నాటి నుంచి చేతికొచ్చిన పంట దిగుబడిని విక్రయించే వరకు రైతన్నకు అడుగడుగునా అండగా నిలుస్తున్నది. గ్రామీణ ప్రాంత రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సేవలను అంది స్తూ ఐదుసార్లు జిల్లా కేంద్ర సహకార బ్యాం కు నుంచి ఉత్తమ సొసైటీగా మెరిట్‌ సర్టిఫికెట్‌ను అందుకున్నది.

సీజనల్‌లో రైతులు నకిలీ కంపెనీల మందు లు వాడి మోసపోకుండా ఉండేందుకు సొసైటీ ఆధ్వర్యంలో ఇందల్వాయి కమాన్‌ వద్ద ఫెర్టిలైజ ర్‌ షాపును ఏర్పాటు చేసి తక్కువ ధరలకే మందులను విక్రయిస్తున్నారు. ఇక్కడ గుర్తింపు పొందిన కంపెనీల మందులను మాత్రమే విక్రయిస్తున్నారు. షాపు నిర్వహణ ద్వారా సమకూరే ఆదాయాన్ని సొసైటీలో జమ చేస్తున్నారు. సొసైటీ పరిధిలోని రైతులకు యూరియా కొరత లేకుండా అందుబాటులో ఉంచుతున్నారు. సహకార సంఘాల్లో నగదు రహిత చెల్లింపులను జరుపాలని డీసీసీబీ అదేశించిన నేపథ్యంలో ఇందల్వాయి సహకార సంఘం ముం దుగానే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు (టీఎస్‌క్యాడ్‌), డీసీసీబీ సంయుక్తంగా డిజిటల్‌ చెల్లింపుల పద్ధతిని ప్రవేశపెట్టి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానానికి శ్రీకారం చుట్టిం ది. దీనిపై ఇప్పటికే సొసైటీ సీఈవోలకు సమాచారం అందింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 141 సహకార సంఘాలు, 200 వరకు ఎరువుల గో దాములు ఉండగా అంతటా డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం సహకార శాఖ ఆధ్వర్యంలో రెండు నెలల కింద ట సొసైటీ సీఈవోలకు మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గత నెలలోనే సహకార బ్యాంకు ద్వారా ప్రతి సొసైటీకి ఖాతా తీ యించారు. సీఈవోలకు కేటాయించిన సీయూ జీ నంబర్లకే క్యూఆర్‌ కోడ్‌లు రూపొందించారు. కోడ్‌ స్టిక్కర్లను సహకార సంఘాల వద్ద, ఎరువులు విక్రయించే గోదాముల వద్ద అతికించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో రైతులకు ఫోన్‌పే లేదా గూగుల్‌ పే ద్వారా డబ్బులు ఎలా పంపించాలనే దానిపై అవగాహన కల్పించారు.


అక్రమాలకు తావుండదు..
రైతులకు నగదు లభ్యత సమస్య ఇకమీదట ఉండకపోవడంతోపాటు క్యూఆర్‌ కోడ్‌ విధానంతో చేసిన చెల్లింపుల్లో అక్రమాలకు తావుండదు. రైతులు, సిబ్బంది వద్ద చెల్లింపు రసీదులు ఉంటాయి.
జిల్లాలో తొలిసారిగా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమలు చేస్తున్న ఇందల్వాయి సంఘం పనితీరును జిల్లా బ్యాంకు అధికారులు ప్రశంసించారు.

వానకాలం సీజన్‌లో రైతులకు రూ.30 లక్షలతో ఎరువులు, విత్తనాలు సరఫరా చేశారు. యాసంగిలో రూ.కోటీ 80 లక్షలతో ఎరువులు సరఫరా చేయగా, గత మూడు నెలల్లో రూ.10 లక్షల పురుగుల మందు వ్యాపారం చేశారు. సంఘం పరిధిలో 4 గ్రామాలు ఉండగా, 100 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములు నాలుగు, 250 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు రెండు ఉన్నాయి. నాబార్డు నిధులు రూ.17 లక్షల 50వేలతో ఇందల్వాయి తండాలో 250 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదాం నిర్మాణం, ఇందల్వాయి స్టేషన్‌లో కోటి రూపాయలతో సంఘ భవనం, షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఎరువుల గోదాం కోసం నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.

ఏడు కొనుగోలు కేంద్రాలు
సంఘం పరిధిలో ఇందల్వాయి, గన్నారం, చాంద్రాయాణ్‌పల్లి, రంజిత్‌నాయక్‌ తండా, ఇందల్వాయి తండా, రూప్లానాయక్‌ తండా, మెగ్యానాయక్‌ తండాలలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి.

సంఘం పరిధిలో రైతులు..
ఇందల్వాయి సహకార సొసైటీ పరిధిలో ఇప్పటి వరకు 1385 మంది రైతులు ఉన్నారు. 800 మంది సొసైటీ ద్వారా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు పొందారు.

మరింత అభివృద్ధి చేస్తాం
సభ్యుల సహకారంతో సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పాలకవర్గం సహకార సంఘం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నది. భవిష్యత్‌లో సహకార సంఘం అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో చిరు వ్యాపారులకు రుణాలను అందించేందుకు డీసీసీబీ సహకారంతో కృషి చేస్తాం. – రతన్‌, సీఈవో

పక్కా ప్రణాళిక అమలు
రైతులకు ఉత్తమ సేవలు అందించడం సంఘం ప్రధాన ఉద్దేశం. సొసైటీ పటిష్టత కోసం ఆదాయ వనరులు సమకూర్చుకుంటాం. అందుకోసం పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. సంఘ అభివృద్ధికి రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఎంతగానో కృషి చేస్తున్నారు.

  • చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి, చైర్మన్
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్నదాతకు ‘సహకారం’

ట్రెండింగ్‌

Advertisement