e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home కామారెడ్డి అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలి

అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలి

అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలి

ఎల్లారెడ్డి రూరల్‌, మే 10: అసంపూర్తిగా మిగిలిన మిషన్‌ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి మున్సిపల్‌ ఏరియాతోపాటు నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావాలన్నారు. ఎండాకాలంలో ప్రజలకు నీటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మిషన్‌ భగీరథ నీటిని స్వయంగా తాగి మినరల్‌ వాటర్‌ కంటే నాణ్యతాప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసించారు. మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ, కౌన్సిలర్లు జంగం నీలకంఠంఅప్ప, రాము, అల్లం శ్రీను, నాయకులు ఇమ్రాన్‌ పాల్గొన్నారు.

12 వార్డుల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా
ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 12 వార్డుల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా చేపడుతున్నట్లు చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో మిషన్‌ భగీరథ అధికారులు, మున్సిపల్‌ కౌన్సిలర్లతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 రోజులుగా ఫిల్టర్‌బెడ్‌ నీటి సరఫరా నిలిపివేశామని, పాత పైప్‌ లైన్ల ద్వారానే మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నెల రోజులుగా మిషన్‌ భగీరథ నీటి సరఫరా జరుగుతున్నదన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ జీవన్‌, మేనేజర్‌ వాసంతి, మిషన్‌ భగీరథ డీఈఈ శివకుమార్‌, ఏఈ విష్ణువర్ధన్‌ రావు, ఎల్లారెడ్డి మిషన్‌భగీరథ ఇన్‌చార్జి అధికారులు వినోద్‌కుమార్‌, సుమంత్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్లు జంగం నీలకంఠం అప్ప, శ్రీను, నాయకులు శ్రావణ్‌కుమార్‌, ము త్తి రామప్ప, ఆదిమూలం సతీశ్‌, పోచయ్య పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలి

ట్రెండింగ్‌

Advertisement