e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home కామారెడ్డి ముస్లిములకు రంజాన్‌ తోఫాల అందజేత

ముస్లిములకు రంజాన్‌ తోఫాల అందజేత

ముస్లిములకు రంజాన్‌ తోఫాల అందజేత

నిజాంసాగర్‌/ మాచారెడ్డి/ బిచ్కుంద, మే 8 : నిజాంసాగర్‌ మండలంలోని ఒడ్డేపల్లి, మాగి, గిర్ని తండాల్లో ముస్లిములకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన రంజాన్‌ తోఫాలను స్థానిక ప్రజాప్రతినిధులు శనివారం అందజేశారు. ఒడ్డేపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు గోరెమియా, ఎంపీటీసీ సభ్యురాలు బాలమణి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రేఖ, మైనార్టీ నాయకులు మీరాన్‌, మాగి గ్రామంలో సర్పంచ్‌ అంజయ్య, గిర్ని తండాలో సర్పంచ్‌ చందర్‌, రెడ్యానాయక్‌ రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దుస్తులను అందజేస్తున్నదని తెలిపారు.
మాచారెడ్డి మండలంలోని భవానీపేట గ్రామంలో ముస్లిములకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లను సర్పంచ్‌ మద్దెల రాజు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రమేశ్‌ గౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు గోవింద్‌రెడ్డి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
బిచ్కుంద మండలకేంద్రంలో ముస్లిములకు రంజాన్‌ కిట్లను సొసైటీ చైర్మన్‌ బాలాజీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాషా, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు జావిద్‌, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల అందజేత
విద్యానగర్‌, మే 8 : జిల్లాకేంద్రంలోని ఇందిరానగర్‌ కాలనీలో అఖిల భారతీయ ప్రజాసేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిములకు రంజాన్‌ పండుగ సామగ్రిని శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌ హాజరై ముస్లిములకు సరుకులను అందజేశారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యాంరావు, సభ్యులు ఖాద్రీ, జాకీర్‌ హుస్సేన్‌, మోతె లావణ్య, సయ్యద్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముస్లిములకు రంజాన్‌ తోఫాల అందజేత

ట్రెండింగ్‌

Advertisement