e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home కామారెడ్డి ముస్లిములకు రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌ల పంపిణీ

ముస్లిములకు రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌ల పంపిణీ

ముస్లిములకు రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌ల పంపిణీ

నిజాంసాగర్‌/బీర్కూర్‌/దోమకొండ/లింగంపేట/ రామా రెడ్డి/ మాచారెడ్డి, మే 7 : బీర్కూర్‌ మండలంలోని దామరంచలో ముస్లిములకు ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్‌ కిట్లను మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు కన్నెగారి కాశీరాం శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లను అందజేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో సదర్‌ సాబ్‌ మహ్మద్‌, నాయబ్‌ సదర్‌ ఎస్‌కే ఇక్బాల్‌, గౌస్‌ పటేల్‌, అబ్దుల్‌ నబీ, షేక్‌ అహ్మద్‌, షకీల్‌, ముజీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

దోమకొండ మండలంలోని అంబారీపేట గ్రామంలో ముస్లిములకు రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లను సర్పంచ్‌ సలీం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆదేశాల మేరకు ముస్లిములకు రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లను అందజేశామని సర్పంచ్‌ అన్నారు. కార్యక్రమంలో విండో వైస్‌ చైర్మన్‌ రంగోల్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ వనిత, ఎంపీటీసీ సభ్యుడు రాజేశ్వర్‌, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో ముస్లిములకు రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లను ఎంపీటీసీ సభ్యురాలు బోధనపు ఇందిర పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిఫ్ట్‌ ప్యాక్‌లను అందజేశారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు బాబుజానీ తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్‌ మండలంలోని మగ్ధుంపూర్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ లక్ష్మీనారాయణ ముస్లిములకు రంజాన్‌ దుస్తులను అందజేశారు. గ్రామంలో 27 కుటుంబాలకు గిఫ్ట్‌ ప్యాక్‌లను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు బషీర్‌, నాయకుడు రమేశ్‌ పాల్గొన్నారు.

రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో ముస్లిములకు సర్పంచ్‌ కుమారి అమృత రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ చంద్రకళ, సొసైటీ డైరెక్టర్‌ స్వామిగౌడ్‌, కారోబార్‌ రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి మండలం మంథనిదేవునిపల్లిలో రంజాన్‌ తోఫాలను సర్పంచ్‌ కొత్త అరవింద్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ స్వామి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముస్లిములకు రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌ల పంపిణీ

ట్రెండింగ్‌

Advertisement