e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home కామారెడ్డి ఉపాధి హామీ పనులను గుర్తించాలి

ఉపాధి హామీ పనులను గుర్తించాలి

ఉపాధి హామీ పనులను గుర్తించాలి

గాంధారి. ఏప్రిల్‌ 1: మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులను గుర్తించాలని, కూలీలసంఖ్యను పెంచాలని ఎంపీడీవో పూర్ణచంద్రోదయ్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉపాధి పనులను గుర్తించాలని అన్నారు. సకాలంలో కూలి అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏపీవో అన్నపూర్ణ, ఎంపీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయాలి
గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయించాలని ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు గుర్తించి కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. సమావేశంలో ఏపీవో తిరుపతితో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి
బిచ్కుంద, ఏప్రిల్‌ 1 : ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని ఎంపీడీవో ఆనంద్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని, కూలీలకు పని కల్పించాలని అన్నారు. వేసవిలో మొక్కలకు సకాలంలో నీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

లేబర్‌ టర్నోవర్‌ను పెంచాలి
ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 1 : ఉపాధిహామీ పనుల్లో 2021-22 సంవత్సరానికి గాను లేబర్‌ టర్నోవర్‌ను పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాజ్‌వీర్‌ సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో, ఈజీఎస్‌ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామసభలు నిర్వహించి ప్రజలకు ఉపాధిహామీ పనులపై అవగాహన కల్పించాలని సూచించారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సకాలంలో నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీవో అతినారపు ప్రకాశ్‌, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో సక్కుబాయి, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ కూడా చదవండీ..

ఆ వృద్ధురాలు మృతి.. బీజేపీ, టీఎంసీ మ‌ధ్య మ‌ళ్లీ మాట‌ల యుద్ధం

రేప్ బాధితురాలు, నిందితుడిని తాళ్ల‌తో క‌ట్టేసి ఊరేగించారు..

ఊరంతా క‌ప్పేసిన మంచు దుప్ప‌టి..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉపాధి హామీ పనులను గుర్తించాలి

ట్రెండింగ్‌

Advertisement