ఆర్మూర్: ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అభినందించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో లింబాద్రిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రొఫెసర్ లింబాద్రి విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆకాంక్షించారు.
డిచ్పల్లి: ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభినందించారు. ఇందూరు బిడ రాష్ర్ట ఉన్నత పదవికి ఎన్నిక కావడం ఎంతో గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు.