e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home కామారెడ్డి దేశానికి దిక్సూచి తెలంగాణ

దేశానికి దిక్సూచి తెలంగాణ

ప్రజా అవసరాలపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన
అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా

ఖలీల్‌వాడి, జూలై 29 : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా అవసరాలపై సీఎం కేసీఆర్‌కు స్పష్ట్టమైన అవగాహన ఉందని, అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తున్నదని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్‌భవన్‌లో గురువారం లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్‌కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తున్నాయ న్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు కల్పించడంతోపాటు ప్రసవం చేయించుకున్న వారికి కేసీఆర్‌ కిట్టు, ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గురుకులాల్లో నాణ్యమైన విద్యనందిస్తూ ఏడాదికి ఒక్కో విద్యార్థిపై సుమారు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నదన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా ఆడబిడ్డలకు పెళ్లికి ఆర్థికసహాయం చేసి గౌరవంగా అత్తారింటికి పంపిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందాలంటే రేషన్‌కార్డు తప్పనిసరని అన్నారు. నగరంలోని ఉత్తర, దక్షిణ మండలాల లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశామని, అర్హులై ఉండి రేషన్‌కార్డు మంజూరుకానివారు క్యాంపు కార్యాలయంలో సంప్రదిస్తే కార్డు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ నీతూకిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇద్రీస్‌ ఖాన్‌, ఆర్డీవో రవికుమార్‌, సౌత్‌, నార్త్‌ మండలాల తహసీల్దార్లు, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మండలాల్లో..
జక్రాన్‌పల్లి/ఖలీల్‌వాడి(మోపాల్‌)/రుద్రూర్‌, జూలై 29: జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌, పుప్పాలపల్లి, మోపాల్‌ మండలం మంచిప్ప, రుద్రూర్‌ మండల కేంద్రంలో లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. జక్రాన్‌పల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమాల్లో వైస్‌ ఎంపీపీ కుంచాల విమలానరేశ్‌, సర్పంచులు తలారి గంగామణి, దావుల పోసాని, సికింద్రాపూర్‌ మాజీ ఎంపీటీసీ కుంచాల రాజు, ఉప సర్పంచ్‌ అప్పాల అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. మోపాల్‌ మండలం మంచిప్పలో సర్పంచ్‌ సిద్ధార్థ, ఎంపీటీసీ సీహెచ్‌ నిర్మల, సుదర్శన్‌, కో-ఆప్షన్‌ మెంబర్‌ అజీమ్‌, ఉప సర్పంచ్‌ జగదీశ్‌, వార్డు సభ్యులు సాయారెడ్డి, మైసయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రుద్రూర్‌లోని రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాతానాగేందర్‌, జడ్పీటీసీ నారోజి గంగా రాం, తహసీల్దార్‌ ముజీబ్‌, ఏఎంసీ చైర్మన్‌ సంజీవ్‌, వైస్‌ఎంపీపీ సాయిలు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంగయ్య, ఎంపీటీసీ సావిత్రి, విండో మాజీ చైర్మన్‌ పత్తి రాము, నాగేందర్‌, లాల్‌ మహ్మద్‌, సర్పంచ్‌ ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana