e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home కామారెడ్డి రైస్‌ మిల్లులకే ఆదరణ!

రైస్‌ మిల్లులకే ఆదరణ!

కామారెడ్డిలో భారీగా దరఖాస్తుల రాక.. నిజామాబాద్‌లో అంతంత మాత్రమే..
రైతుకు మేలు, యువతకు ఉపాధి లక్ష్యంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలో సుమారు 925 ఎకరాలను గుర్తించిన ప్రభుత్వం
సీఎం ప్రత్యేక దృష్టితోచురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం
పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరుతున్న సర్కారు
ఈ నెల 31 వరకు గడువు

నిజామాబాద్‌, జూలై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో అంచనాలకు మించి వరి సాగవుతుండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎక్కువగా రైస్‌మిల్లులు, పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల ఏర్పాటుకే ఆసక్తి చూపుతున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు వారంక్రితం వరకు నిజామాబాద్‌లో 30, కామారెడ్డిలో 82 దరఖాస్తులు రాగా.. ఇందులో సగానికి పైగా రైస్‌మిల్లులవే. సీఎం కేసీఆర్‌ వ్యవసాయరంగానికి పెద్దపీట వేయడంతో బీడు భూములు సైతం సాగుకు నోచుకుంటున్నాయి. దీంతో పంట దిగుబడులు భారీగా వస్తున్నాయి. రైతులకు మరింత లాభం చేకూర్చేలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతుకు లాభం చేకూరడంతో పాటు స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా పెరుగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ పేరిట ఆయా జిల్లాల్లో అధికారులు భూములను సేకరించారు. యూనిట్ల ఏర్పాటుకు ప్రస్తుతం దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా.. వాటికి మంచి స్పందన లభిస్తున్నది.ఈ నెల 31తో దరఖాస్తు గడువు ముగియనుంది.

రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఉవ్వెత్తున దూసుకుపో తున్నది. గతంలో సమైక్య పాలకుల మూలంగా సాగుకు కరెంట్‌ సరిగా ఉండేది కాదు. సాగుకు నీటి గోస. ఎరువులు, విత్తనాలు కష్టతరంగా ఉండేది. అలాంటి దుస్థితికి చరమ గీతం పాడిన సీఎం కేసీఆర్‌… స్వరాష్ట్రం లో సాగును పండుగలా మార్చారు. తద్వారా ఏటేటా బీడు భూములు సాగుకు నోచుకుంటుండడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నిజామాబాద్‌, కామా రెడ్డి జిల్లాలో 2021 యాసంగి లోనే పదిన్నర లక్షల ఎకరా ల్లో పంటలు సాగవ్వడం ఓ రికార్డుగా మారింది. వ్యవసా య రంగం ఊపందుకుంటున్న వేళ వాటి ఉత్పత్తులు సైతం మార్కెట్లోకి భారీగా వస్తున్నా యి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో సేకరించిన ఉత్పత్తులు రాష్ర్టాల్లోనే లక్షల మెట్రిక్‌ టన్నుల్లో నిల్వ ఉండి పోయి ము రిగిపోతున్నాయి. కేంద్రంతో సంబంధం లేకుండా పంట ఉత్పత్తులను స్థానికంగానే ప్రాసెసింగ్‌ చేసుకుంటే రైతు కు లాభం, స్థానికంగా ఉపాధి కల్పించ వచ్చనే ఆలోచనతో సీఎం కేసీఆర్‌ ముందడుగు వేశారు. తెలంగాణ స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ పేరిట ఆయా జిల్లాలో భూములు సేక రించారు. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వాని స్తుండ గా మంచి స్పందన లభిస్తున్నది.

- Advertisement -

మిల్లులకే అధిక ప్రాధాన్యత…
2021 యాసంగిలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో సేకరించిన వరి పంట విలువ అక్షరాల రూ.2400 కోట్లు. అంటే దాదాపు గతంలో ఎన్న డూ లేని విధంగా వరి ధాన్యం పం డింది. ఉభయ జిల్లాల్లో నీరు పుష్కలంగా అందుబాటులో ఉండ డం, చిన్నపాటి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలు ఉండడం, సీఎం కేసీఆర్‌ చొరవతో కాలువల ఆధునికీకరణకు నోచుకోవడం, ఎస్సారెస్పీ పునర్జీవం మొదలు కాకమునుపే బాల్కొండలోని పలు ప్రాంతాలకు సాగు నీరు రావడం, నిరంతర విద్యుత్‌తో బోరు బావుల కింద సాగుకు ఢోకా లేక పోవడంతో చాలా మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపు తున్నారు. ఊ హించని విధంగా ధాన్యం ఉత్పత్తులు పోటె త్తుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం సీఎంఆర్‌ చేయడానికి రైస్‌ మిల్లులు కూడా సరిపోయే పరిస్థితి లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లాలో కొత్తగా పదుల సంఖ్యలో రైస్‌ మిల్లులు ఏర్పాటు అయినప్పటికీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ వస్తుండడంతో మరికొన్ని మిల్లులు స్థాపించేందుకు చాలామంది వ్యాపారులు దరఖాస్తులు సమర్పించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎక్కువగా రైస్‌ మిల్లులు, పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల ఏర్పాటుకు ఆసక్తి చూపుతు న్నట్లు సమాచారం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు వారం క్రితం వరకు నిజామాబాద్‌లో 30, కామారెడ్డి 82 దరఖాస్తులు రాగా ఇందులో సగానికి ఎక్కువగా రైస్‌ మిల్లులు ఉండడం విశేషం. మొత్తం దరఖాస్తుల వివరా లు ఈ నెలాఖరులోగా తెలిసే అవకాశం ఉంటుంది.

టీఎస్‌ఐఐసీకి బాధ్యతలు…
రాష్ట్ర ప్రభుత్వం ఆహార తయారీ పరిశ్రమలను ప్రోత్స హించాలనే ఉద్దేశంతో తెలంగాణ స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌(టీఎస్‌ఎఫ్‌పీజెడ్‌)లను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాకు ఒక ఫుడ్‌ జోన్‌ను కేటా యించింది. కామారెడ్డి జిల్లాలో రెండు ప్రాంతాల్లో ఫుడ్‌ జో న్లు ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రి యను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ)కు అప్పగిం చింది. జూన్‌ 15న జారీ అయిన ఉత్తర్వుల మేరకు కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారు, తమ వ్యాపారాల ను విస్తరించు కోవాలనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకు నేందుకు అవకాశం కల్పించింది. ఫుడ్‌ జోన్‌లో దరఖాస్తుకు జూన్‌ 30 తుది గడువుగా తొలుత నిర్ణయించారు. గడువును జూలై 12కు అనంతం జూలై నెలాఖరు వరకు పెంచుతూ ప్రభు త్వం జీవో జారీ చేసింది. ఫలితంగా ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. టీఎస్‌ఐఐసీ అధికారులు ఫుడ్‌ జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన స్థల సేక రణ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ముమ్మరం చేశారు. దరఖాస్తుల స్వీకరణ నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి జిల్లాలో వంద దరఖాస్తులు దాటినట్లు తెలుస్తున్నది.

925 ఎకరాలు సిద్ధం…
తెలంగాణ స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటును తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్‌ మిల్లులు, ఇతర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఒకే చోట ఏర్పాటు అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్తు అవసరాల నిమిత్తం పెద్ద ఎత్తున భూములు సేకరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 925 ఎకరాలను తెలంగాణ స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుకు సేకరించడం విశేషం. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లో ఒకే చోట 250 ఎకరాల భూమిని సేకరించి టీఎస్‌ఐఐసీకి రెవెన్యూ శాఖ అప్పగించింది. హైదరాబాద్‌కు సమీపం లో, జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న కామారెడ్డి జిల్లాలో భారీగా భూములను ఇందుకోసం సమీక రించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంలో 440.25 ఎకరాలు గుర్తించారు. లింగంపల్లిలో సర్వే నంబర్‌ 79లో 321 ఎకరాలు, జనగాం గ్రామంలోని సర్వే నంబర్‌ 12లో 43.09 ఎకరాలు, సర్వే నంబర్‌ 74లో 75.29 ఎకరాలు గుర్తించారు. తాడ్వాయి మండలంలోని ఖరడ్‌పల్లిలో సర్వే నంబర్‌ 387 నుంచి 393 వరకు 234.17 ఎకరాలు సేకరించగా టీఎస్‌ఐఐసీకి ఈ మొత్తం భూములను బదలాయించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana