e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home కామారెడ్డి గ్రీన్‌చాలెంజ్‌ను విజయవంతం చేద్దాం

గ్రీన్‌చాలెంజ్‌ను విజయవంతం చేద్దాం

పుట్టినరోజున మొక్కను నాటండి
4శాతం పచ్చదనం పెరిగింది
మోర్తాడ్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మోర్తాడ్‌, జూలై24ః పుట్టినరోజు అందరికీ పండుగే కానీ, మన పుట్టినరోజున సమాజానికి ఉపయోగపడేలా పనులు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుకొ మోర్తాడ్‌లోని బృహత్‌ పల్లెప్రకృతివనంలో మొక్కను నాటిన ఆయన మాట్లాడా రు. కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈకార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అడవులు పెరగాలనే ఉద్దేశంతో చేపట్టిన హరితహారం కార్యక్రమంతో ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు శాతం పచ్చదనం పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం పెరిగిన పచ్చదనంతో వర్షాలు బాగానే పడుతున్నాయని, మరో మూడు శాతం పచ్చదనాన్ని పెంచుకుంటే ప్రజలెవరూ మొగులు వైపు చూడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. సీఎం అడుగుజాడల్లో కేటీఆర్‌ నడుస్తూ రాష్ట్ర ప్రజల శేయస్సును కోరుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని, అందులో భాగంగానే పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారని చెప్పారు.

- Advertisement -

అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎల్‌పీలో శ్రీనివాస్‌, ఎంపీపీ శివలింగుశ్రీనివాస్‌, జడ్పీటీసీ బద్దంరవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్‌ పాపాయిపవన్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ పర్సదేవన్న, సొసైటీ చైర్మన్‌ కల్లెంఅశోక్‌, సర్పంచ్‌ ధరణి, సొసైటీ వైస్‌చైర్మన్‌ నవీన్‌, చిన్నరాజేశ్వర్‌, గంగారెడ్డి, ఇంతియాజ్‌, మురళీగౌడ్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. మోర్తాడ్‌లో మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రాలతో కేక్‌ను తయారు చేయించారు. ఈకేక్‌ను మంత్రి కట్‌చేసి కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వేల్పూర్‌ మండలంలో నిర్వహించిన వేడుకల్లో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ భారతి, వైస్‌ ఎంపీపీ సురేశ్‌, ఎంపీటీసీ, సర్పంచులు పాల్గొన్నారు. భీమ్‌గల్‌ మండలంలో మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని కోటి వృక్షార్చనలో భాగంగా 28,500 మొక్కలను నాటారు.

భీమ్‌గల్‌ మున్సిపల్‌ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ మొక్కను నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు, ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేశారు. భీమ్‌గల్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాల ఆవరణలో జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, కుప్‌కల్‌లో సర్పంచ్‌ గుణ్‌వీర్‌రెడ్డి, బాచన్‌పల్లిలో మండల అధ్యక్షుడు నర్సయ్య మొక్కను నాటారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగాధర్‌, వైస్‌చైర్మన్‌ భగత్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్‌పల్లి మండలంలో కేటీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాల్కొండ నియోజక వర్గంలో 3 లక్షల 40 వేల మొక్కలు నాటాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపునందుకొని మండల కేంద్రాలు, గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటారు. జడ్పీటీసీ రాధ, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలంలో మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ పుర్ణానందం, జడ్పీటీసీ రాజేశ్వర్‌, ఎంపీపీ ఉపేంద్ర, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana