కమల్‌హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్. స్వీయనిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం విడుదలచేశారు. కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖాలను మాత్రమే చూపిస్తూ వినూత్నంగా తీర్చిదిద్దిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘యోధుడు మాత్రమే కిరీటాన్ని ధరించాలి. మాలోని ఉత్తమమైన అభినయాన్ని ఆవిష్కరిస్తూ మరో ప్రయత్నం చేయబోతున్నాం. మాకు విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాం’ అని కమల్‌హాసన్ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్‌ఫాజిల్ పాత్రలు నెగెటివ్ షేడ్స్‌తో సాగుతాయని సమాచారం.