ఆలయాలకు పూర్వవైభవం తేవాలి

- ప్రభుత్వవిప్ గంప గోవర్ధన్
- సిద్ధ్దరామేశ్వర, పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీల ప్రమాణస్వీకారం
కామారెడ్డి, ఫిబ్రవరి 22 : ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. భిక్కనూరులోని సిద్ధరామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రమాణస్వీకారం ఆలయ ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి విప్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చైర్మన్ అందె మహేందర్‌రెడ్డి, సభ్యు లు మంద దేవయ్య, తాటిపల్లి శ్రీనివాస్‌గుప్తా, అబ్బ బాలకిషన్, పగడపల్లి సిద్ధారెడ్డి, ధర్మగారి నీలంరెడ్డి, జంగం శ్రీశైలం, రామాయంపేట బాలకృష్ణ, తాటికొండ బాబు, పోచమైన రాజయ్య, వెంకమ్మగారి పెద్దబస్వయ్య, నిట్టూరి నిర్మల, మామిడి శ్రీనివాస్‌రెడ్డితో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో ఆలయానికి నిత్యం వేలాదిమంది భక్తులు వచ్చేవారని, ఆలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ఆలయ ప్రతిష్టను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆలయంలో సిబ్బంది రాజకీయాలు చేస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పద్మానాగభూషణంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిట్టెడి భగవంతరెడ్డి, వైఎస్ ఎంపీపీ యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ పెద్దబచ్చగారి నర్సింహారెడ్డి, భిక్కనూరు సర్పంచ్ తునికి వేణు, మార్కెట్ కమి టీ చైర్మన్, వైఎస్ చైర్మన్లు కుంచాల శేఖర్, హన్మంత్‌రెడ్డి, నాయకులు బాణాల అమృతారెడ్డి, పీపీ నంద రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ..
జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయ నూతన కమిటీ సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఆలయ అభివృద్ధికి తనవంతుగా రూ.5 లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు. చైర్మన్‌గా సబ్బని కృష్ణహరి, డైరెక్టర్లుగా అన్నారం నరేశ్‌రెడ్డి, దుబ్బాక ప్రసాద్, సిరిసిల్ల భారతి, విద్యామరి రాజేశ్, బండారి శ్రీకాంత్ ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబుద్దీన్, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..
- గోల్డెన్ రేజర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న సెలూన్ ఓనర్
- ఈ శుక్రవారం విడుదలవుతున్న 9 సినిమాలు ఇవే!
- బంగారం వద్దు ఇల్లే ముద్దు.. 70 % మంది మహిళల మనోగతం!
- బొలేరో, ఆటో ఢీ.. ఒకరి మృతి, ఆరుగురికి గాయలు
- కోట్లు పలికిన పదిసెకన్ల వీడియో