శనివారం 06 మార్చి 2021
Kamareddy - Jan 27, 2021 , 00:46:16

రద్దయిన పింఛన్‌ డబ్బులు అందజేత

రద్దయిన పింఛన్‌ డబ్బులు అందజేత

39 మందికి డబ్బులను అందజేసిన ఎమ్మెల్యే సురేందర్‌ 

ఎల్లారెడ్డి, జనవరి 26 : పట్టణానికి చెందిన 39 మంది ఇటీవల పెన్షన్‌ కోల్పోవడం, నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వీరికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ పెన్షన్‌ అందేలా కృషిచేశారు. సీఎం కార్యాలయంలో సంప్రదించి పెన్షన్‌ మంజూరు చేయించారు. ఎల్లారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో 39 మందికి జనవరికి సంబంధించిన పెన్షన్‌ డబ్బులను మంగళవారం అందజేశారు. లబ్ధిదారుల పేర్లు గల్లంతుకు కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ విలాస్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యం, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


VIDEOS

logo