ఆదివారం 07 మార్చి 2021
Kamareddy - Jan 25, 2021 , 00:07:51

వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలి

వాహనదారులు రోడ్డు నిబంధనలు  పాటించాలి

డీఎస్పీ జైపాల్‌రెడ్డి 

బాన్సువాడ / నిజాంసాగర్‌/నాగిరెడ్డిపేట్‌, జనవరి 24 : వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను తప్పక పాటించాలని బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో వాహనదారులకు ఆదివారం ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పకుండా ధరించాలని, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడుపవద్దని సూచించారు. అనంతరం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో డ్రైవర్స్‌ డే నిర్వహించారు. హెల్మెట్‌ ధరించని వారికి రోజా పువ్వులను ఇచ్చి ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని కోరారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ సాయన్న, టౌన్‌ సీఐ రామకృష్ణ, పోలీసు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. 

నిజాంసాగర్‌లో పోలీసు కళాజాత బృందం ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎంవీఐలు పవన్‌కుమార్‌, విజేంద్రరెడ్డి ట్రాఫిక్‌ నిబంధనలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాజాత బృందం సభ్యుడు పవన్‌కుమార్‌, ఎస్సై హైమద్‌, సిబ్బంది ప్రసాద్‌, రాజు, గంగారాం పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట్‌ మండలం గోపాల్‌పేట్‌లో ఎస్సై రాజయ్య వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలను వివరించారు. 

VIDEOS

logo