ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం

తిరుగు ప్రయాణంలోనూ పలుచోట్ల పుష్పగుచ్ఛాలు అందజేసిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు
నిజాంసాగర్/బాన్సువాడ/నస్రుల్లాబాద్, జనవరి 24: పిట్లం మండల కేంద్రంలో చిట్టెపురెడ్డి సంఘం అత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కవితకు టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తిరుగు ప్రయాణంలోనూ ఆమెకు పలుచోట్ల పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్న కల్వకుంట్ల కవితకు నిజాంసాగర్ మండల టీఆర్ఎస్ నాయకులు, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు మండలంలోని జాతీయ రహదారిపై నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం కారోబార్ల సంఘం మండల సభ్యులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు.
తిరుగు ప్రయాణంలో..
పిట్లం నుంచి తిరుగు ప్రయాణమైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని తాడ్కోల్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆమెకు పరిచయం చేశారు. అనంతరం ఆమె ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ వెళ్లారు. నస్రుల్లాబాద్ వద్ద స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. నస్రుల్లాబాద్ ఎంపీపీ విఠల్, మైలారం విండో చైర్మన్ పెర్క శ్రీనివాస్, నాయకులు ప్రతాప్, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, కంది మల్లేశ్ తదితరులు ఎమ్మెల్సీని కలిశారు.
ఎమ్మెల్సీని కలిసిన గాంధారి ఏఎంసీ చైర్మన్
గాంధారి, జనవరి 24: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గాంధారి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దబూరి సత్యం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో నెలకొన్న సమస్యలు, చేపట్టే అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్సీకి వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సత్యంరావు, రాజేశ్వర్‌రావు, జి.సాయిలు, బి.విఠల్ పాల్గొన్నారు.