ఆదివారం 07 మార్చి 2021
Kamareddy - Jan 25, 2021 , 00:03:30

ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి

ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి

ప్రభుత్వవిప్‌ గంప గోవర్ధన్‌ 

కామారెడ్డి, జనవరి 24 : చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రభుత్వవిప్‌ గంప గోవర్ధ్దన్‌ పిలుపునిచ్చారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో నిర్మించిన రైతువేదిక భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విప్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం అవతరించిన తర్వాత వెనుకబడిన కులాలకు చెందిన పిల్లల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకునేందుకు గురుకులాలు, హాస్టళ్లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చదువుతో సమాజంలో గుర్తింపుతోపాటు ఉన్నత స్థితికి చేరుకుంటారని, ఆర్థికంగా ఎదుగుతారన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారన్నారు. సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాడారని గుర్తుచేస్తూ ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మా నాగభూషణంగౌడ్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ కుంచాల శేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చిట్టెడి భగవంతరెడ్డి, నాయకులు కిష్టాగౌడ్‌, బోండ్ల రామచంద్రం, పిప్పిరి ఆంజనేయులు, నంద రమేశ్‌, సర్పంచ్‌ సత్తూరి లక్ష్మీరాజలింగం, విండో చైర్మన్‌ బాలగోని రాజాగౌడ్‌, బాలాజీ, చల్మెడ బాబు, వంగూరు వెంకటేశ్‌కుమార్‌, సాయాగౌడ్‌, రాములు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

వాలీబాల్‌ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం..

దోమకొండ, జనవరి24:  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన డివిజన్‌ స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌, ఎంపీపీ కోట సదానంద, మాజీ జడ్పీటీసీ గండ్ర మధుసూదన్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ కుంచాల శేఖర్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ నర్సారెడ్డి, సర్పంచ్‌ అంజలి, ఎంపీటీసీ రమేశ్‌, శారద, ఉప సర్పంచ్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo