సోమవారం 08 మార్చి 2021
Kamareddy - Jan 24, 2021 , 00:53:38

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 23 : రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడినవర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు పదిశాతం రిజర్వేషన్లపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయి. ఈ నిర్ణయం తీసుకున్న  సీఎం కేసీఆర్‌కు ఓసీ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. ఈ మేరకు శనివారం జిల్లాలో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.  జిల్లా కేంద్రంతో పాటు భిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ,బీబీపేట్‌, రాజంపేట్‌, ఎల్లారెడ్డి , రామారెడ్డి తదితర మండలాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo