ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Kamareddy - Jan 23, 2021 , 00:36:38

పథకాల అమలులో రాష్ట్రం నంబర్‌వన్‌

పథకాల అమలులో రాష్ట్రం నంబర్‌వన్‌

లింగంపేట, జనవరి 22: సంక్షేమ పథకాల అమలులో మనరాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అన్నారు. మండల కేంద్రంలోని సెర్ప్‌ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు తన సొంత ఖర్చులతో చీరెలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నదన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడంపై మండల స్థాయిఅధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీసా బేగం, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మాకం రాములు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బండి రాజయ్య, లింగంపేట సర్పంచ్‌ లావణ్య, ఎంపీటీసీ సభ్యులు శమీమున్నీసా, సర్వన్‌, దేవేందర్‌, భాగవ్వ, ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, నాయబ్‌ తహసీల్దార్‌ చంద్రరాజేశ్‌, గిర్దావర్‌ బాలయ్య సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

కాశప్ప చిష్తికి నివాళులు.. 

మండలంలోని అయ్యపల్లి గ్రామానికి చెందిన ఆధ్యాత్మికవేత్త కాశప్ప చిష్తి మూడురోజుల క్రితం మృతిచెందారు. ఎమ్మెల్యే అయ్యపల్లి గ్రామానికి వెళ్లి కాశప్ప సమాధికి నివాళులర్పించారు. అనంతరం కాశప్ప చిష్తి కుమారుడు గురుప్రతాప్‌ను పరామర్శించారు. 

VIDEOS

logo