దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు

తెలంగాణలోఅమలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి రూరల్, జనవరి 19: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 26 మందికి కల్యాణలక్ష్మి, 15 మందికి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్ల పుడితే భారంగా భావించే స్థాయి నుంచి ఆడపిల్లే మాఇంటి మహాలక్ష్మి అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికీ మంజీరానది నీరు సరఫరా ప్రారంభిస్తామని చెప్పారు. జడ్పీటీసీ ఊషాగౌడ్, విండో చైర్మన్ ఏగుల నర్సింహులు, మత్తమాల సర్పంచ్ అశోక్‌రెడ్డి, లక్ష్మాపూర్ సర్పంచ్ రవీందర్‌గౌడ్, సీనియర్ నాయకులు జలంధర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, జంగం నీలకంఠం అప్ప, ఇమ్రాన్, ముజ్జూ, గోపి, జీవన్, చింతల శంకర్, రాము, శ్రీను, ఎడ్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
లింగంపేట, జనవరి 19: మండలంలోని బోనాల్ గ్రామానికి చెందిన మోహన్‌గౌడ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే సురేందర్ మంగళవారం పరామర్శించారు. మోహన్‌గౌడ్ కుమారుడు వారంరోజుల క్రితం మృతిచెందగా.. ఎమ్మెల్యే బాధిత కుటుంబీకులను కలిసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేతోపాటు సర్పంచ్ సుశీల, నాయకులు నయీం, గన్నూనాయక్, సిద్దారెడ్డి, నరేశ్, జొన్నల రాజు, సాయాగౌడ్, గాండ్ల నర్సింహులు, గాంధారి శ్రీనివాస్, మాకం రాములు, ఫతీయొద్దీన్, పర్వయ్య తదితరులు ఉన్నారు.
బీజేపీ నాయకులు మత రాజకీయాలు మానుకోవాలి..
రాజంపేట, జనవరి 19: బీజేపీ నాయకులు మత రాజకీయాలను మానుకోవాలని ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 27 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఏరాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. సర్పంచ్ బీరయ్య, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ హన్మాండ్లు, ఎంపీటీసీ పెంటయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శంకర్, మండల కో-ఆర్డినేటర్ మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లక్ష్మణ్, సొసైటీ చెర్మన్ శివరాములు పాల్గొన్నారు.