సోమవారం 08 మార్చి 2021
Kamareddy - Jan 20, 2021 , 00:24:50

బాధితురాలికి ఎమ్మెల్యే షిండే పరామర్శ

బాధితురాలికి ఎమ్మెల్యే షిండే పరామర్శ

పిట్లం, జనవరి19: మండలకేంద్రానికి చెందిన అంజమ్మ మంగళవారం ఉదయం పొలంలో నాట్లు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌ తగిలి గాయపడింది. దీంతో ఆమెను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న అంజమ్మను ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆయన వెంట జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు విజయ్‌, లక్ష్మారెడ్డి, బాబు, హన్మాండ్లు ఉన్నారు.

VIDEOS

logo