గురువారం 25 ఫిబ్రవరి 2021
Kamareddy - Jan 20, 2021 , 00:24:48

పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తిచేయాలి

పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తిచేయాలి

కామారెడ్డి టౌన్‌, జనవరి 19:  కలెక్టరేట్‌లోని జనహిత భవన్‌లో గాంధారి, తాడ్వాయి, జుక్కల్‌, బిచ్కుంద, దోమకొండమండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఆయా మండలాల అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘పల్లెప్రగతి’ పనులను వంద శాతం నిర్వహించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులను పూర్తిచేయాలన్నారు. పెద్ద ఎత్తున ఉపాధి పనులను చేపట్టి అధిక సంఖ్యలో కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వంద రోజుల పని పూర్తిచేసిన కుటుంబాలకు కొత్త జాబ్‌కార్డులు ఇవ్వాలన్నారు. పనులకు సంబంధించిన అన్ని రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కల సంరక్షణ, ముళ్ల పొదల తొలగింపు తదితర పనులకు నివేదిక తయారు చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులు ఈ నెల 25లోగా పూర్తిచేయాలని, పూర్తి అయిన పనులను సర్పంచులు, సెక్రటరీలకు నోటీసుల ద్వారా తెలియజేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది కల్లాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గాంధారి మండలం దుర్గం గ్రామంలో అత్యధికగా 26 కల్లాలను ఏర్పాటు చేయడంపై జీపీ సెక్రటరీ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. నర్సరీల నిర్వహణలో సర్పంచ్‌, సెక్రటరీలదే కీలక బాధ్యత అని గుర్తుచేస్తూ మొక్కలు ఎండిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సాయన్న, డివిజనల్‌ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

VIDEOS

logo