శనివారం 06 మార్చి 2021
Kamareddy - Jan 19, 2021 , 00:02:59

‘వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం..’

‘వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం..’

దోమకొండ, జనవరి 18: విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని సీజీఆర్‌ఎఫ్‌(కంజ్యూమర్‌ గ్రీవెన్సెస్‌ రిడ్రిసల్‌ ఫోరం) చైర్మన్‌ ఈశ్వరయ్య అన్నారు. దోమకొండ సబ్‌స్టేషన్‌లో డివిజన్‌లోని వినియోగదారుల సమస్యలపై సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దోమకొండ విద్యుత్‌ డివిజన్‌ పరిధిలోని బీబీపేట, భిక్కనూరు, రాజంపేట్‌, దోమకొండ మండలాలకు చెందిన విద్యుత్‌ వినియోగదారులు పాల్గొన్నారు. మొత్తం ఏడు ఫిర్యాదులు రాగా.. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యుత్‌ వినియోగదారులు, ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌, డైరీలను ఆవిష్కరించారు. సమావేశంలో సీజీఆర్‌ఎఫ్‌ సభ్యులు అశోక్‌, కిషన్‌, భూమారెడ్డి, డీఈఈ గణేశ్‌, ఏఈ ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo