శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Kamareddy - Jan 17, 2021 , 00:09:17

మొదటి రోజు 175 మందికి వ్యాక్సినేషన్‌

మొదటి రోజు 175 మందికి వ్యాక్సినేషన్‌

జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌ 

వారంలో నాలుగు రోజుల పాటు టీకాల పంపిణీ 

సదాశివనగర్‌లో కార్యక్రమాన్ని పరిశీలించిన డీఎంహెచ్‌వో 

సదాశివనగర్‌, జనవరి 16: జిల్లావ్యాప్తంగా మొదటి రోజు నాలుగు సెంటర్లలో కలిపి 175 మందికి తొలి విడుతలో కరోనా వ్యాక్సినేషన్‌ వేశామని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. సదాశివనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేస్తున్న తీరును ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి, రాజీవన్‌నగర్‌, భిక్కనూరు, సదాశివనగర్‌ ప్రభుత్వ దవాఖానల్లో మొదటి విడుతలో టీకాలు వేశామని చెప్పారు. జిల్లాలో ప్రతి సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో టీకాలు వేస్తారని చెప్పారు. ఆయనతో పాటు డాక్టర్‌ ఇద్రిస్‌ ఘోరీ, అజ్జుమాన్‌, నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

సదాశివనగర్‌ పీహెచ్‌సీలో టీకాల పంపిణీని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ప్రారంభించారు. ప్రతి ఒక్కరికీ టీకా అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, డాక్టర్‌ ఇద్రిస్‌ ఘోరి, తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీపీ అనసూయ, వైస్‌ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో అశోక్‌, సర్పంచ్‌ బద్దం శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ బీరయ్య, వైద్యసిబ్బంది నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo