గొల్ల కురుమలకు చేయూత

త్వరలో గొర్రెల పంపిణీకి సర్కారు ఏర్పాట్లు
రెండో విడుతలో 1541 యూనిట్ల్లు మంజూరు
కామారెడ్డి జిల్లాలో 314 గొర్రెలకాపరుల సొసైటీలు.. మంది సభ్యులు
హర్షం వ్యక్తంచేస్తున్న లబ్ధిదారులు
నిజాంసాగర్, జనవరి 16: కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇందులోభాగంగా గొల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాతి కానుక అందించింది. వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రెండో విడుతలో గొర్రె పిల్లలను పంపిణీ చేయనుంది. కామారెడ్డి జిల్లాలో 314 సహకార సంఘలు ఉండగా, 31,150 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడుతలో 16,883 మంది సభ్యులకు గొర్రె పిల్లలను అందించగా రెండో విడుతలో 1541 మంజూరయ్యాయి. ఇందులో 909 మం ది డీడీలు చెల్లించగా వారికి త్వరలో గొర్రెలను పంపిణీ చేయనున్నారు.
పంపిణీ ఇలా
ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. యూనిట్‌కు రూ.లక్షా 25వేలు కాగా ప్రభుత్వం 75 శాతం అంటే రూ.93,750 ఇవ్వనుండగా, లబ్ధిదారుడి వాటా కింద రూ.31,250 భరించాల్సి ఉంటుంది. యూనిట్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. యూనిట్ పొందిన వారికి ఎంతో లాభం చేకూరుతుంది. గొర్రెల పెంపకంతో ఏడాదికి ఒక్కో పెంపకందారుడికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. పుట్టిన ప్రతి గొర్రె నుంచి అదనపు ఆదాయం సమకూరుతున్నది. వ్యవసాయంతో పాటు అనుబంధంగా వీటిని పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడం సంతోషంగా ఉంది. రెండో విడుతలో నా పేరు ఉంది. నాతో పాటు డీడీలు కట్టిన ఎంతో మంది ఆనందంతో ఉన్నారు. మాకు ఆర్థికంగా చేయూతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-ఈశ్వర్, గొల్ల కురుమ సంఘం సభ్యుడు, మద్నూర్
తాజావార్తలు
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ
- మనకు కావాల్సింది నిమిషాల్లో తెచ్చిస్తారు
- మరణించీ.. మరొకరికి బతుకునిద్దాం
- అందుబాటులోకి కొవిన్ యాప్ కొత్త వర్షన్
- చిన్నారులను రక్షించిన కాచిగూడ పోలీసులు
- అరుదైన మండలి ఎన్నిక నిర్వహణ..! దినపత్రికంత బ్యాలెట్
- మొండి బకాయిలపై లోక్ అదాలత్