చిరుతల కదలికలు

మాదాపూర్శివారులో సంచారం
సింగరాయిపల్లిలో ఆవుల మందపై దాడి
మాక్లూర్/ రామారెడ్డి, జనవరి 13 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతలు కలకలం సృష్టించాయి. మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామ శివారులోని గుట్టపైన ఉన్న బండరాయిపై పశువుల కాపరులకు చిరుతపులి కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన వారు గ్రామస్తులకు సమాచారం అందించారు. స్థానికులు ఎస్సై రాజారెడ్డికి విషయం తెలుపగా వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి నర్సింగ్‌రావు తన సిబ్బందితో అటవీ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. అప్పటికే బండ రాయిపై చిరుత కనిపించకుండా పోయింది. గతంలో కూడా ఇదే మాదిరిగా చిరుత కనిపించిందని గ్రామస్తులు తెలిపారు. ఉన్నతాధికారులకు చిరుత సమాచారం ఇచ్చామని అటువైపు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.
చిరుత దాడిలో లేగదూడ హతం
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామ శివారులో గల పొలంలో ఉన్న ఆవుల మందపై మంగళవారం అర్ధరాత్రి చిరుత దాడి చేసి లేగ దూడను ఎత్తుకెళ్లింది. స్కూల్ తండాకు చెందిన కన్నేరాం నాయక్ తన ఆవుల మందను ఎరువు కోసం గ్రా మానికి చెందిన దేవేందర్ పొలానికి తీసుకెళ్లాడు. కాగా మంగళవారం రాత్రి కన్నేరాం చూస్తుండగానే చిరుత లేగ దూడను లాక్కెళ్లింది. దీంతో భయాందోళనకు గురైన కన్నేరాం అక్కడే ఉండిపోయాడు. బుధవారం ఉదయం లేగదూడ కోసం వెతకగా కళేబరం కనిపించింది. ఈ విషయమై సర్పంచ్ ఫారెస్టు అధికారులకు సమాచా రం అందించగా వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెండు రోజుల క్రితం కూడా ఓ దూడ ను చంపిందని గ్రామస్తులు తెలిపారు.
తాజావార్తలు
- ఐటీ రిటర్న్ ఇంకా పొందలేదా..? ఇలా చేయండి..
- బాలిక బలవన్మరణం
- ఉగాది నాటికి గ్రేటర్ వరంగల్వాసుల ఇంటింటికి మంచినీరు
- గంగూలీ చెకప్ కోసమే వచ్చారు: అపోలో
- 13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
- ‘ఎన్నికల విధులకు భంగం కలిగిస్తే కోర్టుకు వెళ్తాం’
- కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డెంటిస్ట్‌కు అస్వస్థత
- ట్రాక్టర్ ర్యాలీ: 550 ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్!
- వరుణ్, నటాషా వెడ్డింగ్ : తాజా ఫోటోలు వైరల్
- వంటిమామిడి మార్కెట్‌యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్