మంగళవారం 02 మార్చి 2021
Kamareddy - Jan 14, 2021 , 00:24:35

ఉత్సాహంగా భోగి

ఉత్సాహంగా భోగి

ఖలీల్‌వాడి/విద్యానగర్‌, జనవరి 13: మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి కృషి చేస్తున్నదని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్‌ అన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఆదేశాలతో, కార్యదర్శి నవీన్‌ ఆచారి, జిల్లా అధ్యక్షుడు అవంతిరావు సూచనల మేరకు నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్‌ కాలేజీ మైదానంలో బుధవారం ఉదయం భోగి వేడుకలను నిర్వహించారు. కీడు అంతా భోగి మంటల్లో కాలిపోయి.. ప్రజలందరికీ మేలు జరుగాలని జాగృతి నాయకులు అన్నారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకుడు లక్ష్మీనారాయణ భరద్వాజ్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అపర్ణ, ఘనపురం దేవేందర్‌, తిరుమల శ్రీనివాస్‌, సంతోష్‌, సాయికృష్ణ, కుల్దీప్‌, శ్రీకాంత్‌, సందీప్‌, చింటు, గోపాల్‌, ఆకాశ్‌, దామోదర్‌, సరిత, వసంత, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాశివనం సమీపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో కలెక్టర్‌ శరత్‌ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడును, స్వార్థాన్ని భోగి మంటల్లో కాల్చి మంచి మార్గంలో నడవాలన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందిచేలా గంగిరెద్దుల విన్యాసం, భోగిమంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై జాగృతి ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ, జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంత రాములు, ప్రతినిధులు పద్మజ, సత్యనారాయణ, రమణారావు, వంశీ, చక్రధర్‌, పోశవ్వ, స్వామిగౌడ్‌, హరీశ్‌, హనుమాన్‌ యోగా గురువు గరిపల్లి అంజయ్య, యెల్లంకి సుదర్శన్‌, గెరిగంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo