సోమవారం 08 మార్చి 2021
Kamareddy - Jan 14, 2021 , 00:24:33

వెల్‌కమ్‌.. వ్యాక్సిన్‌!

వెల్‌కమ్‌.. వ్యాక్సిన్‌!

జిల్లాకు చేరిన కరోనా టీకా

16 నుంచి వ్యాక్సినేషన్‌.. 57 కేంద్రాల ద్వారా పంపిణీ

మొదటి విడుతలో 14,479 మందికి.. 

ఖలీల్‌వాడి, జనవరి 12: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 16వ తేదీన కరోనా వ్యాక్సినేషన్‌ చేయాలని రాష్ట్రం ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని వైద్యాధికారులను కలెక్టర్లు అప్రమత్తం చేశారు. ముందుగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా జిల్లావ్యాప్తంగా 40 కోల్డ్‌ చైన్‌ పాయింట్స్‌, 57 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 434 మంది సిబ్బంది మొదటి విడుతలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 11,068 మందికి టీకా వేయనున్నారు. వీరిలో 6516 మంది ప్రభుత్వ, 4552 మంది ప్రైవేటు వైద్య సిబ్బంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 24 కోల్డ్‌ చైన్‌ పాయింట్స్‌, 26 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 310 మంది సిబ్బంది మొదటి విడుతలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న 3411 మందికి టీకా వేయనున్నారు. వీరిలో 3,033 మంది ప్రభుత్వ, 378 మంది ప్రైవేటు వైద్య సిబ్బంది ఉన్నారు. కరోనా టీకాలు బుధవారం రాత్రి ఉమ్మడి జిల్లాకు చేరుకున్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్‌పై నిజామాబాద్‌, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, శరత్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

VIDEOS

logo