మంగళవారం 09 మార్చి 2021
Kamareddy - Jan 10, 2021 , 00:32:46

కొత్త కలెక్టరేట్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

కొత్త కలెక్టరేట్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

కామారెడ్డి టౌన్‌, జనవరి 9: నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌  శరత్‌ అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంప్‌ కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ, ఉద్యానవన శాఖ, అటవీ శాఖ అధికారులతో నూతన కలెక్టరేట్‌ నిర్మాణ పనులపై సమీక్షించారు. అంతర్గత రోడ్లు, పచ్చదనం పెంపొందించే ల్యాండ్‌ స్కేపింగ్‌, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం, సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు మిగిలిపోయిన చిన్నచిన్న పనులన్నీ వేగంగా పూర్తిచేయించాలని ఆదేశించారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ఈఈ రవిశంకర్‌, డీఈ శ్రీనివాస్‌, ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ విద్యాసాగర్‌, ఉద్యాన వన శాఖ అధికారి రాజు పాల్గొన్నారు.


VIDEOS

logo