గురువారం 04 మార్చి 2021
Kamareddy - Jan 10, 2021 , 00:32:44

డిగ్రీ కళాశాల భూముల్లో ఆక్రమణల తొలగింపు

డిగ్రీ కళాశాల భూముల్లో ఆక్రమణల తొలగింపు

 సరిహద్దులను గుర్తించి కందకం తవ్వకం

విద్యానగర్‌, జనవరి 9: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన భూముల సంరక్షణలో భాగంగా కలెక్టర్‌ శరత్‌ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో కామారెడ్డి ఆర్డీవోతోపాటు డీఎస్పీ, సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, కామారెడ్డి తహసీల్దార్‌, రూరల్‌ సీఐ, కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, సీనియర్‌ అధ్యాపకుడిని సభ్యులుగా నియమించారు. ఈ బృందం ఆధ్వర్యంలో కళాశాలకు చెందిన కామారెడ్డి, ఇల్చిపూర్‌ శివారులోని భూముల్లో ఆక్రమణలను శనివారం తొలగించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కళాశాల భూములను సర్వేచేసి హద్దులను ఏర్పాటు చేశారు. పొక్లెయినర్ల సహాయంతో ఆక్రమణలను తొలగించి సరిహద్దుల గుండా మూడడుగుల లోతుతో కందకాన్ని తవ్వించారు. మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ పనులను ఆర్డీవో శ్రీను పర్యవేక్షించారు. సర్వే ఏడీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో హద్దులు నిర్ణయించారు. ఆక్రమణల తొలగింపు సమయంలో రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాశాల భూముల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకున్న కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, ఆర్డీవో శ్రీనుకు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ ధన్యవాదాలు తెలిపారు.


VIDEOS

logo