చైనాకు చెందిన టెక్ దిగ్గజం హువావే రెండు స్మార్ట్‌వాచ్‌లను చైనాలో ఆవిష్కరించింది.హువావే వాచ్ 3 ప్రొ, హువావే వాచ్ 3 పేరుతో వీటిని లాంచ్ చేసింది. కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన హార్మోనీ ఆపరేటింగ్ సిస్టమ్ 2.0 ఆధారంగా ఇవి పనిచేస్తాయి. రెండు వేరబుల్ డివైజ్‌లు 1.43 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేలను కలిగి ఉంటాయి. రెండు వాచ్‌లు దాదాపు ఒకేలా ఉంటాయి. హువావే వాచ్ 3 ప్రొ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంది. దీన్ని ప్రీమియం మెటీరియల్స్‌తో తయారు చేశారు. చైనా మార్కెట్లో బేస్ మోడల్ ధర రూ.29వేలుగా ఉండగా ప్రీమియం వెర్షన్ ధర రూ.37,700గా నిర్ణయించారు. హువావే వాచ్ 3 యాక్టివ్, క్లాసిక్, ఎలైట్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాచ్ 3 ప్రొ క్లాసిక్, ఎలైట్ వేరియంట్లలో లభిస్తుంది.
డిస్ప్లే సైజ్: 36mm
కంపాటబుల్ ఓఎస్: ఆండ్రాయిడ్, ఐఓఎస్
డయల్ షేప్: రౌండ్
డిస్ప్లే టైప్: అమోలెడ్
ఐడియల్ ఫర్: యునిసెక్స్
డిస్ప్లే సైజ్: 36mm
కంపాటబుల్ ఓఎస్: ఆండ్రాయిడ్, ఐఓఎస్
డయల్ షేప్: రౌండ్
డయల్ టైప్: అమోలెడ్
ఐడియల్ ఫర్: యునిసెక్స్