ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Kamareddy - Dec 06, 2020 , 00:48:55

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో నూతన కోర్టు భవనాలు

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో నూతన కోర్టు భవనాలు

  • నిజామాబాద్‌ జిల్లా జడ్జి సాయిరమాదేవి 
  • కామారెడ్డి, ఎల్లారెడ్డిలో భవనాల నిర్మాణానికి స్థలాల పరిశీలన

కామారెడ్డి టౌన్‌, ఎల్లారెడ్డి రూరల్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో అన్ని వసతులతో నూతన కోర్టు భవనాలను నిర్మిస్తున్నట్లు జిల్లా జడ్జి సాయి రమాదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె ఎల్లారెడ్డి, కామారెడ్డి పట్టణాల్లో భవనాల నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు. ఎల్లారెడ్డి పట్టణ శివారులోని మోడల్‌ స్కూల్‌ వద్ద సర్వే నంబర్‌ 1406లోని భూమిని, పోసన్‌పల్లి గ్రామం వద్ద సర్వే నంబర్‌ 373లోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి శివారులో ఉన్న స్థలాన్ని పరిశీలించిన ఆమె కోర్టు భవన నిర్మాణానికి అనుకూలంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. నూతన కోర్టు భవనాల నిర్మాణం కోసం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర చౌహాన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఎల్లారెడ్డిలో ఆమె వెంట ఎల్లారెడ్డి మెజిస్ట్రేట్‌ అనిత, ఆర్డీవో శ్రీను, డీఎస్పీ శశాంక్‌రెడ్డి, తహసీల్దార్‌ సముద్రాల స్వామి, సీఐ రాజశేఖర్‌, డివిజన్‌ సర్వేయర్‌ కృష్ణప్రసాద్‌, మండల సర్వేయర్‌ అభిలాష్‌, న్యాయవాదులు సతీశ్‌కుమార్‌, గోపాల్‌రావు, పండరి, నామ శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు. కామారెడ్డిలో జిల్లా జడ్జి సత్తయ్య, కలెక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా కోర్టు అధికారులు ఉన్నారు. 

VIDEOS

logo