బుధవారం 27 జనవరి 2021
Kamareddy - Dec 04, 2020 , 00:56:48

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌ పార్టీ

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌ పార్టీ

  • ప్రభుత్వ విప్‌   గంప గోవర్ధన్‌

కామారెడ్డిరూరల్‌ : పార్టీ కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. మండలంలోని క్యాసంపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త జనగామ కిషన్‌గౌడ్‌ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. బాధిత కుటుంబానికి పార్టీ నుంచి రూ.రెండు లక్షల ప్రమాద బీమా మంజూరు కాగా.. ప్రభుత్వ విప్‌ వారికి చెక్కును కామారెడ్డిలోని ఆయన నివాసం వద్ద అందజేశారు. సర్పంచ్‌ మంజుల, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, నాయకులు నారాయణరెడ్డి, బాల్‌కిషన్‌గౌడ్‌, రాజిరెడ్డి, జనగామ శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ .. 

దోమకొండ/మాచారెడ్డి : దోమకొండ మం డలంలోని అంబారిపేట, దోమకొండ గ్రామాలకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను విప్‌ గోవర్ధన్‌ గురువా రం కామారెడ్డిలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నదని చెప్పారు. జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌, మాజీ జడ్పీటీసీ మధుసూదన్‌రావు, సర్పంచులు అంజలి శ్రీనివాస్‌, సలీం, ఎంపీటీసీ రాజేశ్వర్‌ పాల్గొన్నారు. మాచారెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పది మంది లబ్ధిదారులకు విప్‌ గోవర్ధన్‌ కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఇన్‌చార్జి ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి, జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు హంజీనాయక్‌, నాయకులు అజీజ్‌, హేమ్లా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo