శనివారం 23 జనవరి 2021
Kamareddy - Dec 04, 2020 , 00:52:53

జీవాలకు నట్టల నివారణ మందులు వేయించాలి

జీవాలకు నట్టల నివారణ మందులు వేయించాలి

బాన్సువాడ రూరల్‌/ నిజాంసాగర్‌/ బీబీపేట్‌  : మేకలు, గొర్రెలు రోగాల బారిన పడకుండా నట్టల నివారణ మందును వేయించాలని పశువైద్యుడు సతీశ్‌ పాడి రైతులకు సూచించారు. బాన్సువాడ మండలంలోని బోర్లంలో మేకలు, గొర్రెలకు ఆయన గురువారం నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు శ్రావణి, ఉపసర్పంచ్‌ మంద శ్రీనివాస్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ దేవేందర్‌రెడ్డి, నాయకులు సాయిలు, గంగ హన్మాండ్లు పాల్గొన్నారు.

జుక్కల్‌ మండలంలోని హంగర్గ గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్‌ బాలమణి, పశువైద్యాధికారి వినీత్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సాయినాథ్‌, సిబ్బంది జైపాల్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 

బీబీపేట్‌ మండలంలోని  రాంరెడ్డిపల్లిలో జీవాలకు పశువైద్య సిబ్బంది నట్టల నివారణ మందు వేశారు. మొత్తం 2,400 గొర్రెలు, మేకలకు మందులు వేశామని పశువైద్య సిబ్బంది తెలిపారు. వారి వెంట పాడి రైతులు, గ్రామపెద్దలు ఉన్నారు. 


logo