జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలి

- పశువైద్యుల సూచన
- పలు గ్రామాల్లో గొర్రెలు, మేకలకు మందులు వేసిన వైద్యులు, ప్రజాప్రతినిధులు
బాన్సువాడ రూరల్ / బీబీపేట్/ నిజాంసాగర్/నాగిరెడ్డిపేట్/ బీర్కూర్ : మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందును తప్పకుండా వేయించాలని పశువైద్యులు సూచించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో జీవాలకు మందులను బుధవారం వేశారు. బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్, రాంపూర్ గ్రామాల్లో పశువైద్యుడు నారాయణ జీవాలకు మందులు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణ్‌కుమార్, ఎంపీటీసీ సభ్యుడు రమణారావు, పశువైద్య సిబ్బంది వెంకటేశ్, సతీశ్ పాల్గొన్నారు. బీబీపేట్ మండలంలోని తుజాల్పూర్, మల్కాపూర్ గ్రామాల్లో జీవాలకు మండల పశువైద్యాధికారిణి హేమశ్రీ మందులు వేశారు. 5,312 గొర్రెలు, 362 మేకలకు నట్టలనివారణ మందును వేశామని ఆమె తెలిపారు.
జుక్కల్ మండలంలోని కెంరాజ్కల్లాలిలో సర్పంచ్ రమేశ్ దేశాయ్ గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిచ్కుంద మండలంలోని గుండెనెమ్లిలో సర్పంచ్ సంగీత నట్టల నివారణ మందులను వేశారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి నితిన్, సిబ్బంది సంజీవ్‌రెడ్డి, రవి, జైపాల్ పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్యశిబిరం నిర్వహించారు. మేకలు, గొర్రెలకు వెటర్నరీ అసిస్టెంట్ తుకారాం నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీని ఎంపీపీ కన్నెగారి కాశీరాం ప్రారంభించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీఏ రోహిత్‌రెడ్డి, ఎంవో మారుతి, పాడి రైతులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పట్టు బిగిస్తున్న భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్‌పై గ్రేటర్ వాసుల ఆసక్తి
- భరోసాతో బడికి