‘పల్లెప్రగతి’పై నిర్లక్ష్యం వీడండి

- కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్‌కుమార్
- బీర్కూర్ ఎంపీడీవో, ఎంపీవోలకు మెమోలు జారీ
- ఇసుక తవ్వకాల్లో నిబంధనలు పాటించాలి
- బీర్కూర్ మంజీరలో ఇసుక రీచ్‌ల పరిశీలనకు కమిటీ
బీర్కూర్ : పల్లెప్రగతి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వీడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్‌కుమార్ అన్నారు. బీర్కూర్ తహసీల్ కార్యాలయంలో పల్లె ప్రగతిపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమీక్షలో బీర్కూర్ ఎంపీడీవో భోజారావు, ఎంపీవో అనిత, పంచాయతీ కార్యదర్శి యోగేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిగ్గా పనిచేయని పంచాయతీరాజ్, ఉపాధిహామీ శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 10వ తేదీలోగా పనులను సరిచేసుకోవాలని తెలిపారు. ఎంపీడీవో, ఎంపీవోలకు చార్జి మెమోలు జారీ చేయాల్సిందిగా డీఆర్డీవో చంద్రమోహన్‌ను కలెక్టర్ ఆదేశించారు. బీర్కూర్ పంచాయతీ కార్యదర్శిని ఒక ఏడాదిపాటు ప్రొఫెషనల్ సమయాన్ని పొడిగించాలన్నారు. ధరణి రిజిస్ట్రేషన్లలో బాన్సువాడ డివిజన్ పరిధిలో బీర్కూర్ మండలం ప్రథమస్థానంలో ఉండడంపై తహసీల్దార్ గణేశ్‌ను కలెక్టర్ అభినందించారు. జిల్లాలో 3 లక్షల 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినట్లు చెప్పారు. అనంతరం మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ గణేశ్, ఎంపీడీవో భోజారావు, ఏవో కమల ఉన్నారు.
సుకరీచ్ల పరిశీలనకు కమిటీ
బీర్కూర్ మంజీరా నదిలో ఇసుక రీచ్‌ల పరిశీలనకు కమిటీ వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అక్కడ ఆరు ఇసుక రీచ్‌లకు అనుమతులు ఉన్నాయని, నాలుగింటి ద్వారా ఇసుకను తరలిస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టర్లు ఇసుక సేకరణలో, తరలింపులో నిబంధనలు పాటించడంలేదని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బాన్సువాడ ఆర్డీవోతో నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇసుక రీచ్‌లను పరిశీలించిన ఆర్డీవో
బీర్కూర్ మంజీరా నదిలో ఉన్న ఇసుక రీచ్‌లను బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ బుధవారం పరిశీలించారు. కాలినడకన వెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. టీఎస్ఎండీసీ అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధిక లోడ్‌తో ఇసుక లారీలు నడుస్తున్నాయని బిచ్కుంద మండలం శెట్లూర్, హస్గుల్ గ్రామాల ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపారు. సేకరించిన వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట పీవో రామక్రిష్ణ, తహసీల్దార్ వెంకట్రావు , గిర్దావార్ సాయిబాబా తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- రేపు సర్వార్థ సంక్షేమ సమితి 28వ వార్షికోత్సవాలు
- కేంద్ర బడ్జెట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
- బెస్ట్ సెల్లింగ్ మారుతి ‘స్విఫ్ట్’
- రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు అనుమతి
- ఇక నుంచి వీళ్లూ పన్నుకట్టాల్సిందే...?
- కంబోడియాలో క్రేజీ ‘బీరు యోగా’!
- చెన్నైలోనే ఐపీఎల్ -2021 వేలం!
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- బైడెన్ జీ! మీ నిబద్ధత అమెరికా విలువలకు ప్రతిబింబం!!
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్