శనివారం 16 జనవరి 2021
Kamareddy - Dec 01, 2020 , 01:37:34

రోడ్డు ప్రమాదంలో జింక మృతి

రోడ్డు ప్రమాదంలో జింక మృతి

నిజాంసాగర్‌: బిచ్కంద మండలంలోని పెద్దదేవాడ-చిన్నదేవాడ గ్రామాల మధ్య  రహదారిపై సోమవారం ఉద యం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో జింకపిల్ల మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో జింక రోడ్డుపక్కన పడిపోయింది. స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకునేలోగా మృతిచెందింది. రోడ్డు ప్రమాదంలో జింక గాయపడినట్లు ముందుగా 1962కు సమాచారం అందించినప్పటికీ వారు సకాలంలో స్పందించలేదని స్థానికులు తెలిపారు.