గురువారం 28 జనవరి 2021
Kamareddy - Nov 29, 2020 , 00:13:54

కొనసాగుతున్న ‘ధరణి’ రిజిస్ట్రేషన్లు

కొనసాగుతున్న ‘ధరణి’ రిజిస్ట్రేషన్లు

కామారెడ్డి  : జిల్లాలోని అన్ని తహసీల్‌ కార్యాలయాల్లో ధరణి వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. శనివారం పది మంది స్లాట్‌ బుక్‌ చేసుకోగా పది రిజిస్ట్రేషన్లు పూర్తిచేసిట్లు తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌ తెలిపారు. కామారెడ్డి మండలంలో అత్యధికంగా 150 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు. రాజంపేట మండలంలో ఏడు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్‌ మోతీసింగ్‌ తెలిపారు. మండలంలో ఇప్పటివరకు మొత్తం 144 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. భిక్కనూరు మండలంలో ఆరు స్లాట్లు బుక్‌ చేసుకోగా.. అన్నింటిని పూర్తి చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్‌ వనజారాణి తెలిపారు. 

నాగిరెడ్డిపేట్‌ తహసీల్‌ కార్యాలయంలో తొమ్మిది రిజిస్ట్రేషన్లు చేశామని తహసీల్దార్‌ సయ్యద్‌ అహ్మద్‌ తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 182 రిజిస్ట్రేషన్లు చేశామని చెప్పారు. లింగంపేట మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నదని తహసీల్దార్‌ నారాయణ తెలిపారు. మండలంలో ఇప్పటివరకు మొత్తం 138 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు తెలిపారు. logo