బాన్సువాడలో విశ్వబ్రాహ్మణుల శోభాయాత్ర

- పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర ఆలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్ఠాపన
- హాజరు కానున్న వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం మనుమడు
బాన్సువాడ : పట్టణంలో విశ్వబ్రాహ్మణులు, వీరబ్రహ్మేంద్ర స్వామి మాలధారులు శుక్రవారం శోభాయాత్ర నిర్వహించారు. ట్రాక్టర్‌పై వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటాన్ని ఉంచి బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమ పీఠాధిపతి కృష్ణమాచారి హాజరై మాట్లాడారు. బాన్సువాడలోని వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన వీరబ్రహ్మేంద స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 30న ఉదయం 8.58 గంటలకు వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం మనుమడు నస్సం వెంకటాద్రిస్వామిజీ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మూడురోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంఘం పట్టణ సభ్యులు రామాచారి, సత్యం, రమణాచారి, విజయ్ చారి, బాబుచారి, యువజన సభ్యులు రాజుచారి, సాయిచరణ్, యోగేశ్వర్ చారి, అరుణ్ చారి, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.