శనివారం 16 జనవరి 2021
Kamareddy - Nov 28, 2020 , 00:50:54

స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలి

స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలి

  • రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు 

కామారెడ్డి టౌన్‌ : స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు అన్నారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో గ్రేడింగ్‌ చేపట్టగా... సీ, డీ గ్రేడ్‌లు వచ్చిన సంఘాలకు సంబంధించిన వీవోఏలు, సీసీలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి మండల సమాఖ్యలో నిర్వహించిన కార్యక్రమంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు, అధికారులు మాట్లాడారు. సంఘాల పనితీరు మెరుగుపర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. కార్యక్రమంలో డీపీఎం ఐబీ సుధాకర్‌, డీపీఎంఎస్‌ వకుల, జ్ఞాను, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు శ్వేత, మురళి, అడిషనల్‌ డీఆర్డీవో సుధీర్‌, జిల్లా సమాఖ్య కార్యదర్శి ఉమ పాల్గొన్నారు.